For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penny Stock: లక్ష పెట్టుబడిని రూ.7.50 కోట్లుగా మార్చిన 77 పైసల స్టాక్.. పైగా ఇది ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీ..

|

Multibagger Stock: భారత ప్రభుత్వ ఆధీనంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యాయి. ఈ కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు భారీ రాబడులు కూడా అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు చాలా బలమైన రాబడిని ఇచ్చాయి. అలాంటి ఒక ప్రభుత్వ సంస్థ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు ఈ స్టాక్ ధర పైసల్లో ఉండేది. ఈ పెన్నీ స్టాక్ లో అప్పుడు లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఎంత వచ్చింది, దీర్ఘకాల పెట్టుబడుల ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 ఇన్వెస్టర్లు కోటీశ్వరులయ్యారు..

ఇన్వెస్టర్లు కోటీశ్వరులయ్యారు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్టాక్ గురించే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీ ధర కేవలం 77 పైసలు కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర దాదాపు రూ.285.35గా ఉంది. ఎవరైనా ఈ కంపెనీలో కేవలం రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ దాదాపు రూ.7 కోట్లకు చేరి ఉండేది.

కేవలం రూ.10 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టినా.. ఇన్వెస్టర్లకు ఇప్పుడు రూ.70 లక్షలు పొందేవారు. ఇలా ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. NSEలో ఈ షేరు 52 వారాల కనిష్ఠ ధర రూ.242.05 కాగా, గరిష్ఠ ధర రూ.408.60గా ఉంది. ప్రస్తుతం ఈ షేర్ రాకెట్ స్పీడ్ తో ఎగబాకుతోంది.

బోనస్ షేర్లతో ఇన్వెస్టర్ల సుడి తిరిగింది..

బోనస్ షేర్లతో ఇన్వెస్టర్ల సుడి తిరిగింది..

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్లు 25 ఆగస్ట్ 2000న BSEలో 77 పైసల రేటు వద్ద ట్రేడవుతున్నాయి. ఆ సమయంలో ఎవరైనా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో లక్ష రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసి ఉంటే, అతనికి దాదాపు 1,29,870 షేర్లు వచ్చేవి. దీని తర్వాత.. హిందుస్థాన్ జింక్ 7 మార్చి 2011న 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. అంటే ఇన్వెస్టర్ కలిగిఉన్న ప్రతి షేరుకు మరో షేర్ ఉచితంగా వచ్చింది. అంటే అతనివద్ద ఉండే షేర్ల సంఖ్య 25,9,740కి పెరిగింది.

లక్ష రూపాయలు 7 కోట్లు ఎలా మారిందంటే..

లక్ష రూపాయలు 7 కోట్లు ఎలా మారిందంటే..

పైన చెప్పుకున్న విధంగా బోనస్ షేర్లు రావటంతో.. కంపెనీలో పెట్టుబడిదారుడి వద్ద ఉన్న షేర్ల సంఖ్య 2,59,740కి పెరిగింది. అదే సమయంలో.. హిందుస్థాన్ జింక్ స్టాక్ 16 జూలై 2022న BSEలో దాదాపు రూ.285 స్థాయిలో ట్రేడవుతోంది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.లక్ష పెట్టుబడి ఇప్పుడు దాదాపు రూ.7.50 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో ఎవరైనా పెట్టుబడిదారుడు 77 పైసల స్థాయిలో కేవలం రూ.10,000 మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ దాదాపు రూ.75 లక్షల వరకు ఉండేది. ఆ విధంగా హిందుస్థాన్ జింక్ షేర్ ఈ కాలంలో 26,500 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది.

2008లో పెట్టుబడి పెడితే..

2008లో పెట్టుబడి పెడితే..

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్ రేటు 24 అక్టోబర్ 2008న BSEలో రూ.23.90 స్థాయిలో ఉంది. 2008 అక్టోబర్ 24న ఎవరైనా కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. అతని పెట్టుబడి విలువ ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం దాదాపుగా రూ.11.86 లక్షలకు పెరిగి ఉండేది. ఈ స్టాక్ నుంచి సగటు ఇన్వెస్టర్ గ్రహించాల్సింది ఏమిటంటే.. సరైన స్టాక్ లో దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే అవి నిలకడగా రాబడులను అందిస్తాయి.

English summary

Penny Stock: లక్ష పెట్టుబడిని రూ.7.50 కోట్లుగా మార్చిన 77 పైసల స్టాక్.. పైగా ఇది ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీ.. | this government sector company gave multibagger returns to its investors know details now

Hindustan Zinc limited stock gave multibagger returns to its investors in long term that turned one lakh to 7.50 crores..
Story first published: Sunday, July 17, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X