For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నియామకాలు పుంజుకుంటున్నాయి, ఐటీ రంగం అదుర్స్, హాస్పిటాలిటీ సూపర్

|

ఇండియన్ జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. వరుసగా మూడో నెల వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన అంటే గత సెప్టెంబర్ నెలతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు నౌకరీ డాట్ కామ్ జాబ్ స్పీక రిపోర్ట్ వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో 2,753 జాబ్ పోస్టింగ్స్‌తో ఇండెక్స్ గరిష్టాన్ని తాకింది. తద్వారా 2019 సెప్టెంబర్ అంటే కరోనా ముందుస్థాయితో పోల్చినా 21 శాతం పెరిగింది.

నౌకరీ జాబ్ స్పీక్ మంత్లీ ఇండెక్స్ రిపోర్ట్. నౌకరీ డాట్ కామ్ వెబ్ సైట్‌లో నెల వారీ ఉద్యోగా జాబితా ఆధారంగా నియామక కార్యకలాపాలను లెక్కిస్తుంది.. రికార్డ్ చేస్తుంది. నౌకరీ జాబ్ స్పీక్ లక్ష్యం వివిధ పరిశ్రమలు, నగరాలు, ఎక్స్‌పీరియన్స్ స్థాయిలలో నియామక కార్యకలాపాలను వెల్లడిస్తుంది.

ఐటీ రంగం అదుర్స్

ఐటీ రంగం అదుర్స్

ఏడాది ప్రాతిపదికన ఐటీ రంగంలో ఏకంగా 138 శాతం పెరిగింది. ఆ తర్వాత హాస్పిటాలిటీ రంగంలో 82 శాతం వృద్ది నమోదయింది. ఇటీవల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేపథ్యంలో భారత పరిశ్రమలో టెక్ ప్రొఫెషనల్స్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. భారతీయ కంపెనీల్లో ఇటీవల డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కారణంగా సాంకేతిక నిపుణుల డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.

అందుకే ఏడాది ప్రాతిపదికన ఐటీ సాఫ్టువేర్/సాఫ్టువేర్ సేవల రంగంలో 2021 సెప్టెంబర్ నెలలో వృద్ధి 138 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఆ తర్వాత వరుసగా హాస్పిటాలిటీ (82 శాతం), రిటైల్ (70 శాతం) ఉన్నాయి. హాస్పిటాలిటీ రంగం పైన కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. కానీ ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ తర్వాత నియామకాలు విద్యా రంగంలో 53 శాతం, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో 43 శాతం, టెలికం/ISP రంగంలో 37 శాతం పెరిగాయి.

హైదరాబాద్‌లో వృద్ధి ఎంతంటే

హైదరాబాద్‌లో వృద్ధి ఎంతంటే

ప్రాంతాలవారీగా చూస్తే మెట్రో నగరాల్లో సెప్టెంబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన 88 శాతం, టైర్ 2 నగరాల్లో 30 శాతం పెరిగింది. వివిధ నగరాల్లో భారీ నియామక వృద్ధికి ఐటీ హబ్‌లో వృద్ధి కనిపించడమే కారణంగా పేర్కొంది. నగరాల విషయానికి వస్తే బెంగళూరు (133 శాతం), హైదరాబాద్ (110 శాతం), పుణే (95 శాతం), చెన్నైలో (85 శాతం) వృద్ధి నమోదయింది.

దేశ రాజధాని ఢిల్లీలో హైరింగ్ యాక్టివిటీస్ 72 శాతం పెరిగాయి. ముంబైలో 60 శాతం, కోల్‌కతాలో 60 శాతం పెరిగింది. టైర్ 2 సిటీ విషయానికి వస్తే అహ్మదాబాద్‌లో 82 శాతం, కోయంబత్తూరులో 46 శాతం, వడోదరలో 33 శాతం, కొచ్చిలో 19 శాతం నమోదయింది.

అన్ని రంగాల్లో వృద్ధి

అన్ని రంగాల్లో వృద్ధి

గత ఏడాదితో పోలిస్తే అన్ని రంగాల్లోను హైరింగ్స్ పుంజుకున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుండి పుంజుకుంది. ఎక్స్‌పీరియన్స్ పరంగా చూస్తే 8 నుండి 12 ఏళ్ల అనుభవం (75 శాతం), 4 ఏళ్ల నుండి 7 ఏళ్లు (65 శాతం),13 ఏళ్ల నుండి 16 ఏళ్లు (57 శాతం), 0 నుండి 3 ఏళ్లు (54 శాతం), 16 ఏళ్లు ఆ పైన (38 శాతం) పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 57 శాతం పెరగగా, నెల ప్రాతిపదికన అంటే ఆగస్ట్ నెలతో పోలిస్తే 3 శాతం పెరిగింది.

English summary

నియామకాలు పుంజుకుంటున్నాయి, ఐటీ రంగం అదుర్స్, హాస్పిటాలిటీ సూపర్ | These sectors seeing strong hiring activity in India

The Indian job market maintained its record-breaking run for the third consecutive month in a row, clocking 57 per cent year-on-year growth in September, according to the latest Naukri JobSpeak report.
Story first published: Sunday, October 10, 2021, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X