For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Apps: ఆ 8 యాప్‍లు మీ మొబైల్‍లో ఉన్నాయా.. అయితే వెంటనే అన్ ఇస్టాల్ చేయండి..!

|

మనం గూగుల్ ప్లే స్టోర్ లో ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకంటాం. చేసుకున్న తర్వాత అన్నింటికి యాక్సిస్ ఇస్తాం. కాంటాక్ట్స్, మీడియా ఇలా ఏది అడిగినా ఒకే అని ప్రెస్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా ఫోన్లలోకి మాల్వేర్ సింపుల్ గా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కీబోర్డ్ సంబంధంచిన యాప్ లు, లాంచర్ యాప్‌లు, ఫిల్టర్‌లతో కూడిన కెమెరా యాప్‌ల వల్ల మాల్వేర్ వచ్చే అవకాశం ఉందట. తాజాగా మాల్వేర్ వచ్చే 8 యాప్ లను గుర్తించారు. ఈ యాప్ లను గుర్తించి గూగలు ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.

డౌన్‌లోడ్ చేసి ఉంటే

డౌన్‌లోడ్ చేసి ఉంటే

మీరు 8 యాప్ ల్లో దేనినైనా డౌన్‌లోడ్ చేసి ఉంటే, మీరు చేయవలసిన మొదటి పని వెంటనే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం. యాప్ పేరు కోసం వినియోగదారులు తమ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ని కూడా ఉపయోగించవచ్చు. వారు ఫోల్డర్‌ను లేదా యాప్‌కు సంబంధించిన ఏదైనా ఫైల్‌ను కనుగొంటే, మీరు దాన్ని తీసివేసి, మీ స్మార్ట్‌ఫోన్‌ను పునఃప్రారంభించాలి. వినియోగదారులు బాగా తెలిసిన డెవలపర్ నుంచి తప్ప సోషల్ మీడియా ప్రకటనల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

Vlog Star Video Editor

Vlog Star Video Editor

Vlogging యాప్. దీన్ని మిలియన్+ డౌన్‌లోడ్ చేసుకున్నారు. Vlog Star Video Editor అనేది యూట్యూబ్ ఎడిటర్‌ల కోసం ఆల్ ఇన్ వన్ వీడియో ఎడిటర్ గా వాడుతున్నారు. ఇది అద్భుతమైన ట్రాన్సిషన్ & వీడియో వంటి వీడియో ఎడిటింగ్ కోసం ఉపయోగపడుతుంది. కానీ దీని వల్ల ఫోన్ లోకి మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉందట.

Creative 3D Launcher

Creative 3D Launcher

ఇది లాంచర్ యాప్, ఇది మీ స్మార్ట్‌ఫోన్ హోమ్ స్క్రీన్‌కి 3D ని ప్రదర్శిస్తుంది. ఈ యాప్ ను 1 మిలియన్ పైగా మంది డౌన్ లోడ్ చేసుకు్నారు. క్రియేటివ్ 3D లాంచర్ అనేది చాలా విలువైన ఫీచర్లు, కూల్ థీమ్‌లు, అందమైన వాల్‌పేపర్‌లతో కూడిన కూల్ లాంచర్ స్టైల్; క్రియేటివ్ 3D లాంచర్‌లో కూడా అనేక ఎంపికలు ఉన్నాయి.

Funny Camera

Funny Camera

పేరు సూచించినట్లుగా కెమెరా ఫిల్టర్‌లను అందించే ఫన్నీ కెమెరా యాప్ ఇది . యూజర్ ఫ్రెండ్లీ, పైకి క్రిందికి స్క్రోలింగ్ మెనులో అమర్చబడి, ఫన్నీ కెమెరా సహజమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. అన్ని ఫిల్టర్‌లతో ఫోటోలు తీయడం కూడా వేగవంతమైంది. ఈ యాప్ ను 50 వేలకు పైగా మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

Wow Beauty Camera

Wow Beauty Camera

బ్యూటీ ఫిల్టర్‌లను అందించే మరో కెమెరా యాప్ ఇది. దీన్ని లక్షకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఫొటోలు అందంగా వస్తాయి.

Gif Emoji Keyboard

Gif Emoji Keyboard

ఇది Gif ఎమోజీలతో కూడిన కీబోర్డ్ యాప్. దీనికి లక్షకు పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయి. దీనిలో అత్యుత్తమ ఎమోజి కీబోర్డ్ GIFలు, అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్ GIFల ఉంటాయి.

Razer Keyboard & Theme

Razer Keyboard & Theme

మరొక ప్రమాదకరమైన కీబోర్డ్ యాప్ ఇది. ఇది Gif ఎమోజీలతో వినియోగదారులకు కీబోర్డ్‌లకు కొత్త రూపాన్ని ఇస్తుందని . దీన్ని కూడా లక్షకు పైగా మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

Freeglow Camera 1.0.0

Freeglow Camera 1.0.0

ఇది ఫ్రీగ్లో కెమెరా ఒక ఉచిత ఫోటోగ్రఫీ యాప్. ఈ యాప్ ను ఐదు వేలకు పైగా మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం

తయారు చేశారు.

Coco camera v1.1

Coco camera v1.1

ఇది కోకో కెమెరా యాప్. దీనికి 1000+ డౌన్‌లోడ్లు ఉన్నాయి.

English summary

Apps: ఆ 8 యాప్‍లు మీ మొబైల్‍లో ఉన్నాయా.. అయితే వెంటనే అన్ ఇస్టాల్ చేయండి..! | There is a possibility of malware entering your mobile due to those eight types of apps

There is a possibility of malware entering the mobile with various types of apps. Especially there is a possibility of stealing our data due to 8 apps.
Story first published: Saturday, November 26, 2022, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X