For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI: ఎస్బీఐ వినియోదారులకు శుభవార్త.. యోనో ద్వారా రైల్వే టికెట్లు బుకు చేస్తే ఆ ఛార్జీలు ఉండవు..

|

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం బ్యాంక్ ఎస్బీఐ (SBI) ఓ ఆఫర్ తీసుకొచ్చింది. యోనో యాప్ (YONO APP) ద్వారా వినియోగదారులు రైల్వేటిక్కెట్లను బుక్ చేసుకుంటే గేట్ ఛార్జీలు ఉండవని వెల్లడించింది. వివరాల ప్రకారం ఎస్‌బిఐ యోనో యాప్ ద్వారా ఐఆర్‌సిటిసి సైట్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే కస్టమర్‌లు ఎలాంటి పేమెంట్ గేట్‌వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

గేట్‌వే ఛార్జీలు మాఫీ

గేట్‌వే ఛార్జీలు మాఫీ

యోనో యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేస్తే పేమెంట్ గేట్‌వే ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయని ఎస్‌బీఐ ప్రకటించింది. IRCTC వెబ్‌సైట్‌లో రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, అన్ని గేట్‌వే కంపెనీలు రూ. 30 వరకు వసూలు చేస్తాయి. అయితే, మీరు SBI YONO యాప్ ద్వారా ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే, ఈ రుసుము ఉండదు.

2017లో

2017లో

SBI తన ఖాతాదారులకు ఒకే యాప్‌లో అన్ని బ్యాంకింగ్, లావాదేవీ సౌకర్యాలను అందించడానికి YONO యాప్‌ను ప్రవేశపెట్టింది. YONO యాప్ మొదట 2017లో ప్రారంభించారు. తరువాత ఈ యాప్‌కి మరికొన్ని ఫీచర్లను జోడించి YONO 2.0 యాప్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రుణ దరఖాస్తులు, డబ్బు లావాదేవీలు, చెక్‌బుక్ లేదా కార్డ్ సంబంధిత సేవలను పొందవచ్చు.

YONO యాప్ టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

YONO యాప్ టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

1.ముందుగా SBI YONO యాప్‌ని ఓపెన్ చేసి బుక్ అండ్ ఆర్డర్ విభాగానికి వెళ్లండి.

2.ఇక్కడ మీరు IRCTC చిహ్నాన్ని చూస్తారు.

3.దీన్ని క్లిక్ చేసిన తర్వాత IRCTC లాగిన్ పేజీ ఓపెన్ అవుతోంది.

4.దానిపై IRTC లాగిన్ IDతో లాగిన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తున్నారో టిక్కెట్‌ను బుక్ చేసి అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించాలి.

5. దీని తర్వాత, మీరు చెల్లింపు పేజీకి వెళ్లి మీ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను పూరించడం ద్వారా చెల్లింపు చేస్తారు.

6.యాప్‌లో టికెట్ కోసం చెల్లిస్తున్నప్పుడు, SBI మీకు పేమెంట్ గేట్‌వే రుసుమును చెల్లించమని అడగదు.

ఓఎస్‌ అప్‌డేట్‌

ఓఎస్‌ అప్‌డేట్‌

అలాగే పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ వాడుతున్న వారు తమ ఓఎస్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 9 లేదా ఆపై వెర్షన్‌ వినియోగించాలని వినియోగదారులకు తెలిపింది. ఆండ్రాయిడ్‌ 9లోపు ఉన్న ఓఎస్‌ వెర్షన్లనకు గూగుల్‌ తన సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను నిలిపివేసిందని పేర్కొంది. భద్రతపరంగా ఎలాంటి లోపాలూ లేని బ్యాంకింగ్‌ సేవలను ఆనందించాలంటే కనీసం ఆండ్రాయిడ్‌ 9 ఓఎస్‌ వెర్షన్‌ను వినియోగించాలని కోరింది.

English summary

SBI: ఎస్బీఐ వినియోదారులకు శుభవార్త.. యోనో ద్వారా రైల్వే టికెట్లు బుకు చేస్తే ఆ ఛార్జీలు ఉండవు.. | There are no gate way charges if you book railway tickets through SBI Yono app

The country's largest government bank SBI has brought an offer. It has been revealed that there will be no gate charges if users book railway tickets through YONO APP.
Story first published: Saturday, September 24, 2022, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X