For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2015 లో రూ 7,000 కోట్లు... ఇప్పుడు రూ 700 కోట్లు, షాప్ క్లూస్ వాల్యుయేషన్ పతనం!

|

భారత దేశ స్టార్టుప్ రంగంలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ షాప్ క్లూస్ ... ప్రస్తుతం కల తప్పింది. 2015 లోనే ఈ కంపెనీ 1 బిలియన్ డాలర్ (సుమారు రూ 7,000 కోట్లు) వాల్యుయేషన్ తో యునికార్న్ క్లబ్ లో చేరిపోయింది. కానీ ప్రస్తుతం ఇది పదో వంతు వాల్యుయేషన్ కోల్పోయి, భారత దేశ చరిత్ర లోనే అత్యంత విలువ పతనమైన స్టార్టుప్ కంపెనీగా ఆవిర్భవించింది. కొన్నేళ్లుగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ తో పోటీ లో నిలబడలేక, తీవ్ర నష్టాలను తట్టుకోలేక షాప్ క్లూస్ సతమతమవుతోంది.

ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. తాజా పెట్టుబడులకు పూర్వం ఇన్వెస్ట్ చేసిన వెంచర్ కాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ముఖం చాటేశాయి. పైగా తమకు ఎగ్జిట్ రూట్ చూపాలని కంపెనీ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ సరైన కొనుగోలు దారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎట్టకేలకు సింగపూర్ కు చెందిన ఒక కంపెనీ షాప్ క్లూస్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఒకప్పటి వాల్యుయేషన్ లో పదో వంతు మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

The unraveling of ShopClues: From Unicorn to also ran

కూ10 చేతికి షాప్ క్లూస్...
తీవ్రమైన ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు షాప్ క్లూస్ ... ఒక కొనుగోలుదారుణ్ని పట్టుకోగలిగింది. సింగపూర్ కు చెందిన ఈ కామర్స్ కంపెనీ కూ10 అనే సంస్థ దీనిని కొనుగోలు చేయబోతోంది. ఆల్ స్టాక్ ప్రాతిపదికన ఈ డీల్ పూర్తికానుందని సమాచారం. ఇందుకోసం కూ10 కేవలం 70 మిలియన్ డాలర్ల (సుమారు రూ 490 కోట్లు) నుంచి రూ 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ 700 కోట్లు) మాత్రమే వెచ్చించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. సింగపూర్ కంపెనీకి షాప్ క్లూస్ ను విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించిందని ఈటీ తెలిపింది. కాగా, 2015 లోనే షాప్ క్లూస్ వాల్యుయేషన్ 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,700 కోట్లు) గా ఉంది. ఇంత భారీ వాల్యుయేషన్ పతనం ఈ రంగంలో ఇదే అత్యధికం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పేరు మారే అవకాశం...
షాప్ క్లూస్ ను కొనుగోలు చేస్తున్న సింగపూర్ కంపెనీ కూ10 ... భారత్ లో తన సొంత బ్రాండ్ పేరుతోనే కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో షాప్ క్లూస్ బ్రాండ్ ని మార్చేస్తారని ప్రచారం జరుగుతోంది. కూ10 కు సింగపూర్ తో పాటు, ఇండోనేషియా, మలేషియా, చైనా, హాంగ్ కాంగ్ లోనూ కార్యకలాపాలు ఉన్నాయి. ఈ కంపెనీ 2015 లో సుమారు 82 మిలియన్ డాలర్ల (సుమారు 570 కోట్లు) సమీకరించింది. ప్రస్తుత డీల్ ప్రకారం షాప్ క్లూస్ కు చెందిన పేమెంట్ విభాగం మోమియో కూడా కూ10 చేతికి వెళ్లనుంది.

రైట్ ఆఫ్ చేసుకొన్నా బడా ఇన్వెస్టర్లు...
షాప్ క్లూస్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. 2015 లో ఒక ఊపు మీద ఉన్న షాప్ క్లూస్ లో నెక్సస్ వెంచర్ కాపిల్, హీలియోన్ వెంచర్ పార్టనర్స్ పెద్ద మొత్తంలో వెచ్చించాయి. ఆ సమయంలో షాప్ క్లూస్ ... భారత్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తో పోటీ పడి మరీ తన కార్యకలాపాలను సాగించింది. కానీ కొద్దీ కాలంలోనే పోటీలో నిలదొక్కుకోలేక పోయింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం షాప్ క్లూస్ వాల్యుయేషన్ పదో వంతుకు పడి పోవటంతో ఇంక చేసేదేమి లేదు కాబట్టి బడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రైట్ ఆఫ్ చేసుకొన్నాయట. ముఖ్యంగా నెక్సస్ వెంచర్స్, హీలియోన్ వెంచర్స్ కు ఇందులో భారీ నష్టాలు సంభవించినట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

Read more about: profit loss
English summary

2015 లో రూ 7,000 కోట్లు... ఇప్పుడు రూ 700 కోట్లు, షాప్ క్లూస్ వాల్యుయేషన్ పతనం! | The unraveling of ShopClues: From Unicorn to also ran

In January 2016, ShopClues became India’s fourth unicorn firm valued over a billion dollars at $1.1 billion. It was no mean feat at a time when Unicorns were rare unlike present day when there are more than 30 such startups that enjoy a billion dollar plus valuation, nearly a third added in 2019 alone.
Story first published: Monday, November 4, 2019, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X