For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నో కేవైసీ..నో పాన్: బ్యాంకులో 1200 ఫేక్ అకౌంట్స్: కోట్ల రూపాయలు సీజ్

|

ముంబై: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా అనుసరిస్తే గానీ ఖాతా తెరవలేం. కేవైసీ ఫామ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్ నంబర్లను బ్యాంకు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ మూడూ అత్యవసరం. అవేవీ లేకుండానే భారీ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.. ఓ కోఆపరేటివ్ బ్యాంక్‌లో.

ఏకంగా 1200 వరకు అకౌంట్లను కేవైసీ వివరాలు లేకుండా, పాన్ కార్డ్‌తో అనుసంధానించకుండా ఓపెన్ చేశారు. 54 కోట్ల రూపాయలను అందులో డిపాజిట్ చేశారు. ఆ బ్యాంక్ పేరు అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్. కేవైసీ, పాన్ కార్డ్ వంటి ప్రాథమిక వివరాలు లేకుండా 1200 అకౌంట్లు ఓపెన్ అయినట్లు పక్కా సమాచారం అందడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సహకార బ్యాంక్ ఇది.

The IT dept conducted raids at headquarter and branches of an Urban Credit Cooperative Bank

హెడ్ ఆఫీస్ సహా శాఖా కార్యాలయాలపై ఈ దాడులు ఏకకాలంగా కొనసాగిస్తోన్నారు ఐటీ అధికారులు. ఈ సందర్భంగా 53.72 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ 1200 అకౌంట్లను సీజ్ చేశారు. కిందటి నెల 27వ తేదీన ఈ దాడులు చేపట్టినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్, ఓ డైరెక్టర్ నివాసాల మీద ఈ రెయిడ్స్ కొనసాగాయి.

పాన్ నంబర్, ఇతర కేవైసీ వివరాలు లేకుండా కొత్తగా 1200 అకౌంట్లను ఓపెన్ చేసినట్లు గుర్తించామని సీబీడీటీ తెలిపింది. బ్యాంకు ఉద్యోగులే ఈ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తులను స్వయంగా భర్తీ చేశారని, వాటి మీద సంతకాలు, వేలిముద్రలు కూడా వారే వేశారని వివరించింది. వాటిల్లో 53.72 కోట్ల రూపాయల నగదును డిపాజిట్ చేశారని, ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఏడు రోజుల వ్యవధిలో 700 బ్యాంక్ అకౌంట్లు ఈ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఓపెన్ అయ్యాయని, అందులో 34.10 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని సీబీడీటీ వివరించింది. కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా అందులో ఉన్నాయని స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో పొందుపరిచిన ఖాతాదారులను విచారించగా.. తమ పేరు మీద అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో అకౌంట్లు ఓపెన్ అయిన విషయం తమకు తెలియదని వెల్లడించినట్లు పేర్కొంది.

English summary

నో కేవైసీ..నో పాన్: బ్యాంకులో 1200 ఫేక్ అకౌంట్స్: కోట్ల రూపాయలు సీజ్ | The IT dept conducted raids at headquarter and branches of an Urban Credit Cooperative Bank

The Income Tax Dept restrained Rs 53.72 crore after a search operation held at the headquarter and one of the branches of an Urban Credit Cooperative Bank located in Maharashtra on Sept 27: Central Board of Direct Taxes (CBDT).
Story first published: Saturday, November 6, 2021, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X