For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sula Vineyards IPO: సులా వైన్‌యార్డ్స్ ఐపీఓ..! ఎప్పుడంటే..

|

భారతదేశపు అతిపెద్ద వైన్ తయారీదారు సులా వైన్‌యార్డ్స్ డిసెంబర్ 12-14 మధ్య దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. సులా వైన్‌యార్డ్స్‌ను "కేటగిరీ సృష్టికర్త"గా పరిగణిస్తారు. "యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 9న ఇష్యూ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 14 వరకు రిటైలర్లుకు" అందుబాటులోకి వస్తుంది. ఈ IPO ద్వారా, కంపెనీ మార్కెట్ నుండి 950 నుంచి 1000 కోట్ల రూపాయలను సేకరించవచ్చు. త్వరలో ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ కూడా ప్రకటిస్తారు.

వైన్ తయారీ కంపెనీ

వైన్ తయారీ కంపెనీ

సులా వైన్‌యార్డ్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయితే, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన దేశంలోనే మొట్టమొదటి వైన్ తయారీ కంపెనీ అవుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, జూలైలో దాఖలు చేసిన సులా వైన్యార్డ్స్ DRHP ప్రకారం, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ పరిమాణం 25,546,186 ఈక్విటీ షేర్ల వరకు ఉంటుంది.

SEBI

SEBI

IPO తీసుకురావడానికి కంపెనీ ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుండి అనుమతి పొందింది. జూలై 2022లో IPOని ప్రారంభించేందుకు కంపెనీ SEBIకి డ్రాఫ్ట్ పేపర్ (DRHP) దాఖలు చేసింది. సుల వైన్యార్డ్స్ షేర్లు BSE మరియు NSEలలో లిస్ట్ అవుతాయి. సులా వైన్‌యార్డ్స్‌లో బెల్జియన్ ఫ్యామిలీ ఆఫీస్ వెర్లిన్‌వెస్ట్ పెట్టుబడి ఉంది. ఇది ఒక దశాబ్దం క్రితం మొదటిసారిగా పెట్టుబడి పెట్టింది.

నాసిక్‌, బెంగళూరు

నాసిక్‌, బెంగళూరు

ముంబైకి ఈశాన్యంగా 180 కి.మీ దూరంలో ఉన్న నాసిక్‌లో సులా ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీకి రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఒకటి నాసిక్‌లో, మరొకటి బెంగళూరులో ఉంది. జనవరి నాటికి, ఇది 13 మిలియన్ లీటర్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 11 మిలియన్ లీటర్లు నాసిక్‌లో, 2 మిలియన్ లీటర్లు బెంగళూరులో తయారు చేస్తుంది. ఈ సంస్థ దేశీయ వైన్ పరిశ్రమలో ఆధిపత్య మార్కెట్ వాటాను కలిగి ఉంది.

 13 బ్రాండ్‌లు

13 బ్రాండ్‌లు

ఈ కంపెనీ 13 బ్రాండ్‌ల క్రింద సుమారు 56 దేశీయ లేబుల్‌లను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఎలైట్, ప్రీమియం, ఎకానమీ, పాపులర్ విభాగాలుగా వాటి ధర, కూర్పు, రుచి, ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా వర్గీకరించారు. ప్రీమియమైజేషన్ స్ట్రాటజీ కింద ఎలైట్, ప్రీమియం సెగ్మెంట్ల నుంచి పెరుగుతున్న సహకారం దీర్ఘకాలంలో కంపెనీ ఆదాయాలు, మార్జిన్‌లు పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ICRA జనవరి 2022 నివేదిక విడుదల చేసింది.

రెండు వైన్ రిసార్ట్‌లు,

రెండు వైన్ రిసార్ట్‌లు,

సులా వైన్‌యార్డ్స్ వైన్‌లను ఉత్పత్తి చేయడం, విక్రయించడంతోపాటు, కంపెనీ రెండు వైన్ రిసార్ట్‌లు, బియాండ్ సులా, సోర్స్ ఎట్ సులా ద్వారా హాస్పిటాలిటీ సెగ్మెంట్ నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. దిగుమతి చేసుకున్న వైన్, ఇతర కోర్ స్పిరిట్‌లను పంపిణీ చేయడానికి లీ గ్రాండ్ నోయిర్, హార్డీస్, బెలూగా వోడ్కా మొదలైన అంతర్జాతీయ బ్రాండ్‌లతో ఈ కంపెనీకి డీలర్‌షిప్ ఒప్పందాలు ఉన్నాయి.

1996లో

1996లో

సులా వైన్‌యార్డ్స్ కంపెనీని 1996లో స్థాపించారు.2021-22లో సుల వైన్యార్డ్స్ ఆదాయం రూ.453.92 కోట్లు కాగా లాభం రూ.52.14 కోట్లు. 2020-21లో ఆదాయం రూ. 417.96 కోట్లు, లాభం రూ. 3.01 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, CLSA ఇండియా, IIFL సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉండగా, KFin టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉంది.

English summary

Sula Vineyards IPO: సులా వైన్‌యార్డ్స్ ఐపీఓ..! ఎప్పుడంటే.. | The IPO of Sula Vineyards is likely to start from December 12

India's largest wine maker Sula Vineyards is coming up with an IPO between December 12-14.
Story first published: Tuesday, December 6, 2022, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X