For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Interest Rate: శుభవార్త చెప్పిన కేంద్రం.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటు పెంపు..

|

జనవరి-మార్చి, 2023 త్రైమాసికానికి సంబంధించి కొన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం శుక్రవారం వడ్డీ రేటును పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) దేశంలో వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

జనవరి 1 నుంచి

జనవరి 1 నుంచి

రేట్ల పెంపుదల 20bps నుంచి 110 bps వరకు పెంచారు. పెంచిన వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తాయి. సవరించిన రేట్ల ప్రకారం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ప్రస్తుతం 6.8 శాతం ఉండగా.. పెరిగిన తర్వాత వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ ఇస్తుండగా.. అది 8 శాతానికి పెంచారు.

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్

1 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధి గల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు 1.1 శాతం వరకు వడ్డీ రేటు పెరగనుంది. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్లు ఇప్పుడు 6.6% వడ్డీ రేటును ఇస్తుండగా.. రెండు నుంచి మూడు సంవత్సరాల డిపాజిట్లు వరుసగా 6.8% నుంచి 6.9% వడ్డీ రేటును అందిస్తున్నారు.

పీపీఎఫ్

పీపీఎఫ్

5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు ఎటువంటి మార్పు చేయలేదు. వీటిపై 5.8% వడ్డీ రేటును ఇస్తున్నారు. అయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF) పై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్ లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం సమీక్షిస్తుంది.

English summary

Interest Rate: శుభవార్త చెప్పిన కేంద్రం.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటు పెంపు.. | The government on Friday hiked interest rate on small savings schemes

The government on Friday increased the interest rate on some small savings schemes for the January-March quarter of 2023.
Story first published: Saturday, December 31, 2022, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X