For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతన్ టాటా ఫెస్టివ్ గ్రీటింగ్స్: ఆసక్తికరంగా..సింపుల్‌గా

|

ముంబై: రెండు సంవత్సరాలు.. కరోనా వైరస్ పాలిట పడ్డాయి. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఈ 2020, 2021 కోట్లాదిమందికి చేదు జ్ఞాపకాలను మిగిలించింది. ఈ రెండు సంవత్సరాలు మనవి కానివిగా మారాయి. లక్షలాదిమంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రుల పాలయ్యారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేల్ అయింది. అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

జనవరిలో ఐపీఓల జాతర: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సహా: కంప్లీట్ లిస్ట్ ఇదేజనవరిలో ఐపీఓల జాతర: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సహా: కంప్లీట్ లిస్ట్ ఇదే

 అమెరికాపై..

అమెరికాపై..

అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా సైతం కరోనా వైరస్ ధాటికి కకావికలమైంది. కరోనా వల్ల అత్యధిక మరణాలు సంభవించింది అమెరికాలోనే. పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా నమోదైందీ ఇక్కడే. ప్రపంచవ్యాప్తంగా 54,09,503 కోట్ల మంది కరోనా వల్ల మరణించారు. 27,93,64,494 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో ఒక్క అమెరికాలోనే 8,37,671 మరణాలు నమోదయ్యాయి. 5,29,86,307 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

రెండో స్థానంలో భారత్..

రెండో స్థానంలో భారత్..

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో కొనసాగుతోంది. 3,47,79,815 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 4,79,520 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. లక్షలాది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయిన చేదు కాలం అది. ఈ స్థాయిలో కల్లోల పరిస్థితులను మిగిల్చిన 2020, 2021 సంవత్సరాల్లో సంభవించిన పరిణామాలు వీలైనంత త్వరగా విస్మరించాలనే భావిస్తారు చాలామంది.

 ఒమిక్రాన్ విజృంభణతో..

ఒమిక్రాన్ విజృంభణతో..

ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి సమీపించే సమయానికి కొత్త వేరియంట్ విస్తృతం కావడంతో అనేక రాష్ట్రాలు మళ్లీ ఇంక్షల్లోకి వెళ్లాయి. నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నాయి. కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేశాయి. ఇప్పటిదాకా 17 రాష్ట్రాల్లో 415 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

 రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా..

మహారాష్ట్ర-108, ఢిల్లీ-79, గుజరాత్-43, తెలంగాణ-38, కేరళ-37, తమిళనాడు-34, కర్ణాటక-31, రాజస్థాన్-22, హర్యానా-4, ఒడిశా-4, ఆంధ్రప్రదేశ్-4, జమ్మూకాశ్మీర్-3, పశ్చిమ బెంగాల్-3, ఉత్తర ప్రదేశ్-2, చండీగఢ్-1, లఢక్-1, ఉత్తరాఖండ్-1 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలో మళ్లీ ఈ ఒమిక్రాన్ వల్ల లాక్‌డౌన్ తరహా పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరిలో ఒమిక్రాన్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ అవే తరహా పరిస్థితుల మధ్య..

ఈ పరిస్థితుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవాల్సి రావడం పట్ల దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా స్పందించారు. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మనలో చాలామందికి అత్యంత కష్టంగా గడిచి ఉంటుందని చెప్పారు. వారి జీవితాల్లో దుర్భర పరిస్థితులను చవి చూసి ఉండొచ్చని అన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సీజన్ ఆరంభాన్ని దృష్టిలో ఉంచుకుని- దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మంచే జరుగుతుందంటూ..

మంచే జరుగుతుందంటూ..

రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. కొత్త సంవత్సరంలో తన బంధువులు, ఆప్తులు, తన చుట్టూ ఉండేవారు, దేశ ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉంటారని చెప్పారు. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

English summary

రతన్ టాటా ఫెస్టివ్ గ్రీటింగ్స్: ఆసక్తికరంగా..సింపుల్‌గా | The 2021 yet again has been difficult one for most of us, coming year will bring good health: Ratan Tata

Ratan Tata extends his greetings to the peoples and said that the last year (2021) yet again has been difficult one for most of us, coming year will bring good health.
Story first published: Saturday, December 25, 2021, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X