For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కర్ణాటకలో ఎలాన్ మస్క్ 'టెస్లా' కార్ల తయారీ కంపెనీ

|

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ భారత్‌లో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇది కర్ణాటకకు రానుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. 2021 జనవరిలోనే టెస్లా కర్ణాటకలో తమ సంస్థ పేరును నమోదు చేసుకుంది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఓ అనుబంధ సంస్థను నమోదు చేసుకుంది.

యడ్యూరప్ప మాట్లాడుతూ.. టెస్లా కర్ణాటకలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, తుమకూర్ జిల్లాలో రూ.7775కోట్లతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, బెంగళూరులో ప్రొడ‌క్ష‌న్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోందని, టెస్లా ఇండియా డైరెక్టర్లుగా వైభవ్ తనేజా, శ్రీరామ్, డేవిడ్ జాన్‌ను ప్రకటించిందని వార్తలు వచ్చాయి.

Tesla will open manufacturing unit in Karnataka

భారత్‌‌లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తే లాభమో చూసుకొని, నెదర్లాండ్స్‌ను ఎంచుకున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇటీవల భారత్‌లో ఎలాన్ మస్క్ రిజిస్టర్ చేసిన టెస్లా మోటార్స్ అండ్ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్ నెదర్లాండ్స్ మాతృసంస్థగా వ్యవహరిస్తుంది.

English summary

కర్ణాటకలో ఎలాన్ మస్క్ 'టెస్లా' కార్ల తయారీ కంపెనీ | Tesla will open manufacturing unit in Karnataka

After forming its India entity, Tesla is going to be setting up a manufacturing facility in India, in the state of Karnataka. The news comes from Karnataka Chief Minister BS Yediyurappa who announced the manufacturing facility in a statement given in Kannada.
Story first published: Sunday, February 14, 2021, 11:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X