For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీలర్ లేకుండా... టెస్లా మోడల్ 3 కారు బుకింగ్స్ జనవరి నుండే, జూన్‌లో ఫస్ట్ కారు

|

న్యూఢిల్లీ: టెస్లా అభిమానులకు గుడ్‌న్యూస్! టెస్లా మోడల్ 3 కార్లను 2021 జూన్ నెలలో భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ మోడల్ బుకింగ్ వచ్చే నెల (జనవరి) నుండి ప్రారంభిస్తున్నారు. భారతీయులకు ఇప్పటి వరకు టెస్లా అందుబాటులో లేకపోయినప్పటికీ, ఈ స్టాక్స్ కొనుగోలుకు గత కొన్ని నెలలుగా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో స్టాక్స్ మాత్రమే కాదు, ఈ వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

Sovereign Gold Bond: నేటి నుండే గోల్డ్ బాండ్ స్కీం, ఆ ధర కంటే రూ.300 తక్కువSovereign Gold Bond: నేటి నుండే గోల్డ్ బాండ్ స్కీం, ఆ ధర కంటే రూ.300 తక్కువ

మోడల్ కారు రికార్డ్స్

మోడల్ కారు రికార్డ్స్

టెస్లా కార్లు ఇండియాలో 2021లో అడుగు పెడుతున్నాయి. ఇందుకోసం జనవరి నుండి మోడల్ 3 కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ చివరి నాటికి కార్ల డెలివరీని ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టెస్లా ఇంక్ తయారీ మోడల్ 3 కార్లు అత్యంత వేగంగా అమ్ముడవుతోన్నాయి. ఈ కారు మూడేళ్ల క్రితం మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కాలంలో మోడల్ 3 కార్లు ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక సేల్ రికార్డును సాధించాయి.

89 శాతం వాటా

89 శాతం వాటా

టెస్లా ఇంక్ స్టాక్ ఈ ఏడాది 700 శాతం ర్యాలీ చేసింది. ఎస్ అండ్ పీ 500 సూచీలో కంపెనీకి చోటు దక్కింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాల్లో మోడల్ 3, మోడల్ వై కార్ల వాటా 89 శాతం కావడం గమనార్హం. దీంతో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు కొద్ది నెలల క్రితం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏడాదే ఇండియా మార్కెట్లోకి తీసుకు రావాలని భావించినప్పటికీ ఆలస్యమైందని కూడా తెలిపారు.

డీలర్ లేకుండా విక్రయం

డీలర్ లేకుండా విక్రయం

సమాచారం మేరకు టెస్లా మోడల్ 3 కార్ల బుకింగ్స్ జనవరిలో ప్రారంభం కానున్నాయి. జూన్నెలలో ఫస్ట్ కారు భారత్‌లో లాంచ్ చేస్తారు. దీని ధర రూ.55 లక్షల నుండి రూ.60 లక్షల మధ్య ఉంది. టెస్లా కంపెనీ డీలర్ లేకుండానే నేరుగా ఈ ఎలక్ట్రానిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. 3.5 సెకన్లలో 0 నుండి 100 కిలో మీటర్ల వేగం పెంచుకోవచ్చు.

2016లో కూడా మోడల్ 3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. కానీ ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీలు, దిగుమతి సుంకం వంటి కారణాలతో ఆలస్యమైంది. అప్పుడు భారత్ నుండి పలువురు కస్టమర్లు బుక్ చేశారు. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, వూనిక్ నుండి సుజయత్ అలీ, గోక్యూఐఐ నుండి విశాల్ గోండాల్ తదితరులు బుక్ చేశారు.

English summary

డీలర్ లేకుండా... టెస్లా మోడల్ 3 కారు బుకింగ్స్ జనవరి నుండే, జూన్‌లో ఫస్ట్ కారు | Tesla to launch Model 3 in India in June, bookings to begin next month

Years after Tesla first decided to launch the electric vehicle brand in India, the company might finally bring its first car to India as early as next year. A new report even suggests that the bookings will commence as early as next month.
Story first published: Monday, December 28, 2020, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X