నాటి మిత్రులే నేటి బద్ధ శత్రువులు..డోనాల్డ్ ట్రంప్-ఎలోన్ మస్క్ మధ్య స్నేహం ఎందుకు చెడిందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..స్సేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. యూఎస్ ఎన్నికల సమయంలో పురివిప్పిన వీరి స్నేహం క్రమంగా మసకబారుతోంది. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరి స్నేహం ఇప్పుడు శత్రుత్వంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వీరి స్నేహానికి బీటలు ఎక్కడ వారాయి. తెర వెనుక ఏం జరిగింది. ఇద్దరి మధ్యా స్నేహం చెడిపోవడానికి కారణాలు ఏంటీ..
సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. వీరి యుధ్దాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తూ కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీరి స్నేహం చెడిపోవడానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక బిల్లు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిల్లును నాకు తెలియకుండా ఎలా ఆమోదిస్తారని ఎలాన్ మస్క్ అడగంతో గొడవ మరింత పెద్దదైనట్లు సమాచారం. నేను ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఖర్చులతో పాటు పన్నులను తగ్గించే బిల్లు మీద మాట మాత్రమైనా చెప్పలేదని ఎలాన్ మస్క్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

జూన్ 5న మొదలైన ఈ వార్ మరింతగా ముదురుతోంది. అయితే ఈ యుద్ధ సునామి టెస్లా షేర్లను తాకింది. జూన్ 5న కంపెనీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ఏకంగా టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 152 బిలియన్ డాలర్లకు కుప్పకూలింది. దీంతో టెస్లా వాటాదారులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే శాఖకు మస్క్‌ను అధిపతిగా నియమించారు. దీని కారణంగా మస్క్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది.అయితే మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవైపు కంపెనీకి తగిన సమయం కేటాయించకపోవడం వల్ల టెస్లాషేర్లు దెబ్బతింటున్నాయి. ఈ సంవత్సరం జనవరి 21న టెస్లా వాటా 424 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 295 డాలర్లకి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే టెస్లా వాటాదారులు కంపెనీపై శ్రద్ధ చూపాలని పట్టుబట్టారు. దీంతో మస్క్ కంపెనీ మీద ఫోకస్ పెట్టడానికి ట్రంప్ నుండి దూరం జరుగుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత నష్టం వచ్చినా.. టెస్లా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. బుధవారం నాటికి, టెస్లా మార్కెట్ విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది టయోటా మోటార్ 290 బిలియన్ల డాలర్ల కంటే చాలా ఎక్కువ.
గత సంవత్సరం చివరి నుండి టెస్లా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది, గత ఐదు సెషన్లలో దాదాపు 20 శాతం పతనమయ్యాయి. సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 25 శాతం పడిపోయింది. అయితే, గత ఒక సంవత్సరం కాలంలో టెస్లా షేర్ ధర 63 శాతానికి ఎగబాకింది. EV స్టాక్ ఐదు సంవత్సరాలలో 383 శాతం పెరిగింది.
ఇద్దరి మధ్య వార్ కథ ఏంటంటే..
ట్రంప్ ఏమంటున్నారంటే: ఎలాన్ మస్క్ ని పిచ్చివాడిలా పిలిచాడు డొనాల్డ్ ట్రంప్.ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని అడిగానని అయితే.. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ సహాయాన్ని ఉపసంహరించుకోవాలనే చట్టం కారణంగా అతను పిచ్చివాడయ్యాడు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ సహాయం నిలిపివేస్తారనే వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆయనతో నాకు మంచి సంబంధంతో నేను మస్క్ కి చాలా సహాయం చేశానని అయితే ఈ సంబంధం కొనసాగుతుందో లేదో ఇప్పుడు నేను చెప్పలేనని చెప్పుకొచ్చారు ట్రంప్.
ఖర్చులను తగ్గించే బిల్లు గురించి మస్క్ కు అన్నీ తెలుసని..అయితే ముందు అంగీకరించినా ప్రభుత్వం నుండి విడిపోయిన తర్వాతే అతను వ్యతిరేకించడం ప్రారంభించాడని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంటానని ట్రంప్ బెదిరించారు. ప్రభుత్వం నుంచి మస్క్ పొందుతున్న బిలియన్ డాలర్ల సబ్సిడీలను ఆపేస్తానని తెలిపారు. బైడెన్ ఇలా ఎందుకు చేయలేదో నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు ట్రంప్.
మస్క్ ఏమంటున్నారంటే : బిల్లు గురించి నాకు తెలుసని ట్రంప్ అబద్ధం చెబుతున్నారు. ఈ బిల్లు నాకు ఎప్పుడూ చూపించలేదు. అలాగే ఏ ఎంపీ కూడా చూడకుండా అర్ధరాత్రి ఈ బిల్లును ఆమోదించారని మస్క్ మండిపడ్డారు.నా వల్లే ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ నా మీదనే యుద్దానికి దిగాడని మండిపడ్డారు. ట్రంప్ కృతజ్ఞత లేని వ్యక్తిని విమర్శలు గుప్పించారు. నేను సహాయం చేయకపోతే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవాడని మస్క్ అన్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు సభను నియంత్రించి ఉండేది.
సెనేట్‌లో 51-49 మంది రిపబ్లికన్లు మాత్రమే ఉండేవారని అన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని పగ్గాలు వాన్స్ కు ఇవ్వాలని పట్టుబట్టారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని..ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని మస్క్ అన్నారు. ఎప్స్టీన్ బాల వ్యభిచారానికి పాల్పడగా జైలు శిక్ష వేస్తే జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలనే ట్రంప్ నిర్ణయానికి వస్తే..తన డ్రాగన్ విమానాలను మూసివేస్తానని చెప్పిన మస్క్ మళ్లీ మాటమార్చి ఇప్పుడు అలా చేయనని చెప్పారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.