For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Budget: శుభవార్త.. రూ.1 లక్ష వరకు రుణమాఫీ! స్థలం ఉంటే ఇంటికి ఆర్థిక సాయం

|

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. రైతుబంధు, బీమా పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి పంటలను మద్దతు ధరకు కొనేందుకు ప్రత్యేక నిధి కింద రూ.వెయ్యి కోట్లను కేటాయించింది. అలాగే రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీకి పెద్ద మొత్తం కేటాయించింది. వ్యవసాయ శాఖ మొత్తం కేటాయింపుల్లో దాదాపు 89 శాతం ఈ మూడు పథకాలకే దక్కాయి.

<strong>Telangana Budget: దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఎక్కువ</strong>Telangana Budget: దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఎక్కువ

రైతుబంధుకు భారీ కేటాయింపు

రైతుబంధుకు భారీ కేటాయింపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రైతుబంధు పథకానికి రూ.12వేలు కోట్లు కేటాయించారు. అయితే రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇప్పుడు రూ.2వేల కోట్లు పెంచారు. రుణమాఫీ అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2018-19లో రూ.10,479 కోట్లు, 2019-20లో రూ.12,000 కోట్లు, 2020-21లో రూ.14,000 కోట్లు రైతుబంధుకు కేటాయించారు

రైతులకు శుభవార్త.. రుణమాఫీ

రైతులకు శుభవార్త.. రుణమాఫీ

ఒక్కో రైతుకు రూ.1 లక్ష లోపు రుణాన్ని మాఫీ చేస్తారు. ఇందులో భాగంగా తొలుత రూ.25వేల లోపు రుణ బకాయిలు ఉన్న రూ.5.83 లక్షల మంది రైతుల అప్పును ఒకేసారి తీర్చేయాలని లేదా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.1,198 కోట్లు విడుదల చేస్తుంది. ఈ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో ఇస్తారు.

రూ.1 లక్ష వరకు రుణం ఉంటే..

రూ.1 లక్ష వరకు రుణం ఉంటే..

రూ.25వేల నుండి రూ.1 లక్షల వరకు బకాయి ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం రూ.24,738 కోట్లు కేటాయించారు. వాటిని నాలుగు దఫాలుగా ఇశ్తారు. తొలి దఫా కింద రూ.6,225 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. పంటలకు మద్దతు ధర కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపు చేయడం ఇదే తొలిసారి.

సొంత స్థలం ఉంటే ఆర్థిక సాయం

సొంత స్థలం ఉంటే ఆర్థిక సాయం

ప్రతి 5వేల ఎకరాల రైతులు ఒకచోట చేరి సమావేశమయ్యేందుకు రైతు వేదికలను నిర్మించనున్నారు. ఒక్కోదానికి రూ.12 లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. ఇందుకు రూ.350 కోట్లను కేటాయించారు. ఇక, స్థలం ఉన్న వారి కోసం లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,500 కోట్లు ప్రతిపాదించింది. ఇళ్లు లేని వారికి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారు.

English summary

Telangana Budget: శుభవార్త.. రూ.1 లక్ష వరకు రుణమాఫీ! స్థలం ఉంటే ఇంటికి ఆర్థిక సాయం | Telangana Budget: Rythu Bandhu scheme to be extended to more ryots

Chief Minister K Chandrasekhar Rao said that Rythu Bandhu, the investment support scheme to farmers, would be continued in future too.
Story first published: Monday, March 9, 2020, 7:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X