For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Hiring: ఇండియాలో గూగుల్ కొత్త నియామకాలు.. హైదరాబాద్, బెంగళూరుల్లో..

|

Google Hiring: ఇప్పటి వరకు అమెరికా టెక్ కంపెనీ తన ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇదంతా గత నెలకు సంబంధించిన వ్యవహారం. సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ అధ్వాన్న పరిస్థితులు రాకుండా చూసేందుకే 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపారు.

గూగుల్ నియామకాలు..

గూగుల్ నియామకాలు..

ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే గూగుల్ తొలగింపులు ఇక నిలిచిపోయినట్లు తెలుస్తుంది. కంపెనీ భారతదేశంలో కొత్తగా నియామకాలను చేపడుతోంది. ఇందుకోసం వివిధ ఉద్యోగ ఖాళీలను గూగుల్ ఇండియా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. అయినా గూగుల్ ఉద్యోగుల తొలగింపుల్లో ఎక్కువగా ప్రభావితం అయింది అమెరికాలోని ఉద్యోగులేనని చెప్పుకోవాలి. అవి భారత విభాగానికీ పాకుతాయని అందరూ భావించినప్పటికీ అంత భారీ ప్రభావం ఉండకపోవటం చాలా మందికి ఊరటను కలిగించింది.

బెంగళూరు-గురుగ్రామ్..

బెంగళూరు-గురుగ్రామ్..

కంపెనీ తాజాగా ఇండియాలో అతితక్కువగా 453 మందిని తొలగించింది. అయితే ఇదే సమయంలో హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరుతో సహా గూగుల్ కార్యాలయాల్లో ఖాళీలను పూరించేందుకు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. మేనేజర్, స్టార్టప్ సక్సెస్ టీమ్, ఎంప్లాయీ రిలేషన్స్ పార్టనర్, స్టార్టప్ సక్సెస్ మేనేజర్, గూగుల్ క్లౌడ్, వెండర్ సొల్యూషన్స్ కన్సల్టెంట్, గూగుల్ క్లౌడ్, ప్రోడక్ట్ మేనేజర్, డేటాబేస్ ఇన్‌సైట్‌లు మరెన్నో ఉన్నాయి.

 సుందర్ ఈ-మెయిల్..

సుందర్ ఈ-మెయిల్..

కంపెనీ ఊహించినదానికంటే వాస్తవ ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సీఈవోల సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో వెల్లడించారు. అయితే గూగుల్ తొలగింపులను నిర్వహించిన తీరుతో ఉద్యోగులు పెద్దగా సంతోషంగా లేరని తెలుస్తోంది. గూగుల్ తొలగించిన తన ఉద్యోగులకు మంచి సెటిల్మెంట్ ఆఫర్ చేసింది. ఇదే సమయంలో 6 నెలల పాటు హెల్త్ కేర్, 2022 బోనస్ అండ్ వెకేషన్ టైమ్, ఉద్యోగ నియామక సేవలతో పాటు ఇమ్మగ్రేషన్ కు సహకారం అందిస్తామని వెల్లడించింది. అయితే తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదని పిచాయ్ స్పష్టం చేశారు.

English summary

Google Hiring: ఇండియాలో గూగుల్ కొత్త నియామకాలు.. హైదరాబాద్, బెంగళూరుల్లో.. | Tech jaint google hiring posted openings in linkedin for Indian Offices, Hyderabad openings

Tech jaint google hiring posted openings in linkedin for Indian Offices, Hyderabad openings
Story first published: Friday, February 17, 2023, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X