For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో.. ఇలా అయితే వెళ్లిపోతాం: పాకిస్తాన్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థల హెచ్చరిక!

|

పాకిస్తాన్ కొత్త సోషల్ మీడియా నిబంధనలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం చట్ట విరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్ ( ప్రొసీజర్, ఓవర్ నైట్ సేఫ్ గార్డ్స్) రూల్స్ (RBUOC) 2020 ప్రకారం తొలగించడం, బ్లాక్ చేయడంపై కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్‌ను ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్ యాక్ట్ 201(PECA) కింద సిద్ధం చేశారు. RBUOC నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్ని అంశాలు ISP(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు) వర్తింపచేయబడ్డాయి. ఇది టెక్ దిగ్గజాలకు ఆగ్రహం కలిగించింది.

ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ రోజు సంపాదన రూ.449 కోట్లు: ప్రపంచ కుబేరుల్లో 40వ స్థానంముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ రోజు సంపాదన రూ.449 కోట్లు: ప్రపంచ కుబేరుల్లో 40వ స్థానం

టెక్ దిగ్గజాల హెచ్చరిక

టెక్ దిగ్గజాల హెచ్చరిక

పాక్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా నిబంధనలు ఆసియా ఇంటర్నెట్ కొలేషన్ (AIC)కి ఆగ్రహం తెప్పించింది. AICలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిబంధనలు సమీక్షించాలని లేదంటే ఇంటర్నెట్ సేవలు కొనసాగించడం కష్టతరం అవుతుందని చెబుతున్నాయి. నిబంధనలు సమీక్షించకుంటే సేవలను నిలిపివేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించాయి. పాక్ కొత్త నిబంధనలు చాలా ఆందోళకరంగా ఉన్నట్లు తెలిపింది.

కొత్త నిబంధనలు ఇవీ...

కొత్త నిబంధనలు ఇవీ...

పాక్ కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలపై నియంత్రణ కోసం సంబంధిత అధికార యంత్రాంగానికి అధికారాలు కట్టబెట్టింది. మతం, ఉగ్రవాదం, అశ్లీలం, విద్వేషాలు, రెచ్చగొట్టే సమాచారాన్ని నిలువరించడంలో సోషల్ మీడియా కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే 3.14 మిలియన్ డాలర్ల జరిమానా విధించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ప్రభుత్వం అడిగితే ఏ సమాచారాన్ని అయినా సోషల్ మీడియా సంస్థలు పూర్తి వివరాలు అందించాలి. అభ్యంతరం చెప్పిన కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలి. ఇస్లామాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అక్కడే డేటా సర్వర్లను ఉంచాలి. పాకిస్తాన్‌లో 50,000 మంది యూజర్ల కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లేదా పాక్ టెలి కమ్యూనికేషన్ అథారిటీలో రిజిస్టర్ అయిన ఐఎస్పీ, ఎస్ఎంసీ జాబితాలో ఉన్న సంస్థలు తొమ్మిది నెలల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తొమ్మిది నెలల్లో ఇస్లామాబాద్‌లోని చిరునామాతో పర్మినెంట్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

కోర్టుకు..

కోర్టుకు..

దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో లేనందున ఈ నిబంధనలు తప్పనిసరి అని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాగా, పాక్ తాజా నిబంధనలపై టెక్ దిగ్గజాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజల వాక్స్వాతంత్రాన్ని హరించేలా ఉన్నాయని తెలిపింది. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్న సోషల్ మీడియా సంస్థలు అప్పీల్‌కు వెళ్లే అవకాశముంది.

English summary

వామ్మో.. ఇలా అయితే వెళ్లిపోతాం: పాకిస్తాన్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థల హెచ్చరిక! | Tech giants threaten to leave Pakistan over new social media censorship law

Pakistan has notified new social media rules that have placed all internet service providers on par with social media companies, drawing a sharp reaction from stakeholders as well as digital rights activists who have termed them as draconian.
Story first published: Sunday, November 22, 2020, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X