For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోస్ట్ వ్యాల్యుబుల్ ఐటీ బ్రాండ్‌లో రెండో స్థానంలో TCS, టాప్ 25లో 5 భారత కంపెనీలు

|

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిలిచింది. అమెరికా దిగ్గజం యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ టాప్ 25 ఐటీ కంపెనీల్లో 5 భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాప్ 10లో మూడు కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు, 2020-22 కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్స్‌లో 6 భారతీయ బ్రాండ్స్ ఉన్నాయి. భారతీయ ఐటీ సేవల బ్రాండ్స్ 2020-22లో సగటున 51 శాతం వృద్ధిని సాధించగా, అమెరికా బ్రాండ్స్ మాత్రం 7 శాతం క్షీణతను నమోదు చేయడం గమనార్హం.

ప్రపంచ టాప్ ఫోర్

ప్రపంచ టాప్ ఫోర్

మోస్ట్ వ్యాల్యుబుల్ ఐటీ బ్రాండ్ జాబితాలో అమెరికా దిగ్గజం యాక్సెంచర్ వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఐటీ కంపెనీ వ్యాల్యూ గత ఏడాది 39 శాతం పెరిగి 36.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐబీఎంను టీసీఎస్ వెనక్కి నెట్టి, రెండో స్థానంలో నిలిచింది. టీసీఎస్ బ్రాండ్ వ్యాల్యూ 12 శాతం పెరిగి 16.8 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2020 నుండి 24 శాతం ఎగిసిపడింది.

2022లో ఇన్ఫోసిస్ కూడా ఐబీఎంను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. గత ఏడాది అయిదే స్థానంలో ఉన్న ఇన్ఫీ ఇప్పుడు మూడుకు వచ్చింది. 52 శాతం వ్యాల్యూ వృద్ధితో 12.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండేళ్లలో 80 శాతం వృద్ధి చెందింది. ఐబీఎం 106 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

భారత టాప్ కంపెనీలు ఇవే..

భారత టాప్ కంపెనీలు ఇవే..

ప్రపంచ టాప్ 25లో భారత్ నుండి 5 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు విప్రో 7వ స్థానం, హెచ్‌సీఎల్ టెక్ 8వ స్థానం, టెక్ మహీంద్రా 15వ స్థానం, ఎల్టీఐ 22వ స్థానంలో నిలిచాయి. ఈ కంపెనీలు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కంపెనీల టాప్ 10 జాబితాలో ఉన్నాయి.

ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500-2022 నివేదికను విడుదల చేసింది.ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఐటీ బ్రాండ్‌గా విప్రో నిలిచింది. అన్ని రంగాల్లో కలిపి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 25 కంెపనీల జాబితాలో కూడా విప్రోకు చోటు దక్కింది.

టాటా.. చంద్రశేఖరన్

టాటా.. చంద్రశేఖరన్

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. మరుసటి రోజే టీసీఎస్ ప్రపంచ అత్యంత విలువైన రెండో బ్రాండ్‌గా నివేదిక వెల్లడైంది. భారత్‌లో టాప్ సీఈవోగా చంద్రశేఖరన్ నిలిచినట్లు బ్రాండ్ ఫైనాన్స్ బ్రాండ్ గార్జియన్‌షిప్ ఇండెక్స్ 2022 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 250 టాప్ సీఈవోల్లో చంద్రశేఖరన్ స్థానం 25. దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత విలువైన తొలి వంద బ్రాండ్స్‌లో టాటా గ్రూప్ మాత్రమే చోటు దక్కించుకుంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని లిస్టెడ్ 20 సంస్థల మార్కెట్ క్యాప్ 70 లిస్టెడ్ ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ.

ఆపిల్ నెంబర్ వన్

ఆపిల్ నెంబర్ వన్

ఇక ప్రపంచంలో అన్ని రంగాల్లో కలిపి విలువైన కంపెనీగా ఆపిల్ నిలిచింది. ఈ బ్రాండ్ వ్యాల్యూ 355 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్ టిక్ టాక్. దీని వ్యాల్యూ ఏడాది వ్యవధిలో 215 శాతం ఎగిసివపడింది. ప్రపంచ టాప్ 250 సీఈవోల్లో సత్య నాదెళ్ల మొదటి స్థానంలో నిలిచారు. పార్మా రంగంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న బ్రాండ్ ఆస్ట్రాజెనికా. ఆ తర్వాత ఫైజర్ ఉంది.

English summary

మోస్ట్ వ్యాల్యుబుల్ ఐటీ బ్రాండ్‌లో రెండో స్థానంలో TCS, టాప్ 25లో 5 భారత కంపెనీలు | TCS world's second most valuable IT brand, Infosys fastest growing

TCS has become the second most valued brand in the information technology services sector globally, while Accenture retains the title of the world’s most valuable and strongest IT services brand, according to Brand Finance.
Story first published: Thursday, January 27, 2022, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X