For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదిహేడేళ్లలో 3,000 శాతం రిటర్న్స్, టీసీఎస్ అదుర్స్

|

దేశీయ అతిపెద్ద దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఐపీవోకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారీ రిటర్న్స్ అందించింది. టాటా గ్రూప్‌కు ప్రధాన ఆదాయ వనరు టీసీఎస్. గత పదిహేడేళ్ల కాలంలో ఈ సంస్థ వాటాదారులకు 3,000 శాతానికి పైగా రిటర్న్స్ అందించింది. ఈ మేరకు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2004లో కంపెనీ ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు పైన రూ.850 పెట్టుబడిగా పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ రూ.28,000కు చేరుకుంది.

ఈ మేరకు టీసీఎస్‌ వాటాదారుల 26వ వార్షిక సమావేశం(AGM)లో మాట్లాడుతూ ప్రస్తావించారు. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ తన నగదు నిల్వల్లో 95 శాతాన్ని వాటాదారులకు పంచినట్లు చెప్పారు. బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో మొత్తం రూ.33,873 కోట్లు షేర్ హోల్డర్లకు చెల్లించినట్లు తెలిపారు.

TCS stock has given 3,000 percent return since IPO, says N Chandrasekaran

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమ కంపెనీ నిరంతరం కొత్త సేవలు అందిస్తోందని చంద్రశేఖరన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల్లో 25.9 శాతం పురోగతిని నమోదు చేసింది. ప్రతి షేర్ పైన రూ.38 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.

English summary

పదిహేడేళ్లలో 3,000 శాతం రిటర్న్స్, టీసీఎస్ అదుర్స్ | TCS stock has given 3,000 percent return since IPO, says N Chandrasekaran

Tata Consultancy Services (TCS) has weathered the pandemic very well, and has earned tremendous goodwill from customers, which enhanced the firm’s standing in the market, N Chandrasekaran, chairman, said in his virtual address of the 26th Annual General Meeting on Thursday.
Story first published: Friday, June 11, 2021, 9:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X