For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS: ఐఐఎం గ్రాడ్యుయేట్ల ఎంపికలో టీసీఎస్ టాప్.. సంక్షోభంలో సంతోషం..

|

TCS: ఇండియాలో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న టీసీఎస్ లో ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లేనని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే ఉద్యోగుల క్షేమం విషయంలో కంపెనీ చూపించే శ్రద్ధ అలాంటిది. ఇటీవల ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలన్న కంపెనీ మాంద్యం సమయంలోనూ మిగతా కంపెనీల కంటే ఎక్కువగానే రిక్రూట్ మెంట్ చేసుకుంటోంది.

ఐఐఎం గ్రాడ్యుయేట్స్..

ఐఐఎం గ్రాడ్యుయేట్స్..

మూన్ లైటింగ్ సమస్య అధికంగా ఉన్న తరుణంలో టీసీఎస్ ఐఐఎమ్ ల నుంచి కొంత మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంటోంది. ప్రీమియర్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఒకటైన IIM అహ్మదాబాద్ నిర్వహించిన సమ్మర్ ప్లేస్‌మెంట్‌లో 35 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొన్నాయి.

అత్యధిక ఉద్యోగాలు..

అత్యధిక ఉద్యోగాలు..

ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ లో ఐటీ మేజర్ టీసీఎస్ అత్యధిక మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను ఆఫర్ చేసింది. ఈ క్రమంలో కంపెనీ 11 మందికి ఆఫర్లను అందించింది. ఇదే సమయంలో ఐటీతో పాటు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్, కన్స్యూమర్ టెక్, కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, EdTech, ఎంటర్‌ప్రెన్యూర్స్ టెక్, ఫిన్‌టెక్, ఫుడ్ & డైరీ కంపెనీలు, గేమింగ్ & స్పోర్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ & గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నాయి.

ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు..

ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు..

ఈ డ్రైవ్ లో టీసీఎస్ 11 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించగా.. ఎఫ్‌ఐఎన్ ఐక్యూ 5 మందికి, కన్స్యూమర్ టెక్ కంపెనీ AUDIFY, justdial, Uber, Zomato సైతం ప్లేస్‌మెంట్లను ఆఫర్ చేశాయి. వీటికి తోడు అడోబ్, అట్లాసియన్, నిప్పాన్ స్టీల్, న్యూక్లియస్ ఆఫీస్ పార్క్, ఏలియన్స్ గ్రూప్, సింపుల్, సుజుకి మోటార్ సైతం ఆఫర్లు అందించాయి.

అంతర్జాతీయంగా డిమాండ్..

అంతర్జాతీయంగా డిమాండ్..

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలల్లో విద్యను అభ్యసించే వారికి కేవలం భారతీయ కంపెనీల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా సైతం మంచి డిమాండ్ ఉంది. అయితే భవిష్యత్తు నవ టెక్నాలజీల అభివృద్ధిలో యువ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపతాయనే యోచనలో టీసీఎస్ ఎక్కువగానే ప్లేస్‌మెంట్స్ అందించింది. ఇది కంపెనీ వ్యాపారం, నిర్వహణలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

TCS షేర్లు..

TCS షేర్లు..

అత్యంత గడ్డు సమయాల్లోనూ కంపెనీ వేగంగా ముందుకు సాగటం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ రోజు టీసీఎస్ స్టాక్ మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో రూ.3,219.80 వద్ద ఉంది. 2022లో టీసీఎస్ షేర్లు దాదాపు 15 శాతానికి పైగా క్షీణించాయి. అయితే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.4,043గా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీ రెండవ త్రైమాసికం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.

Read more about: tcs jobs iim iim ahmadamad
English summary

TCS: ఐఐఎం గ్రాడ్యుయేట్ల ఎంపికలో టీసీఎస్ టాప్.. సంక్షోభంలో సంతోషం.. | TCS recruited record number of graduates from IIM ahmadabad in campusdrive

TCS recruited record number of graduates from IIM ahmadabad in campusdrive
Story first published: Wednesday, November 9, 2022, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X