For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS: చక్కటి ఆలోచనతో TCS.. మూన్‌లైటింగ్ కు ఇదే పరిష్కారం.. టెక్కీల్లో కొత్త ఆనందం..

|

TCS: ఆర్థిక మందగమనం కారణంగా కొత్త ప్రాజెక్టులను పొందడంలో భారతీయ ఐటీ రంగం ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నందున మార్జిన్ పరిమాణం భారీ భారంగా కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో.. ఐటి ఉద్యోగులకు మూన్‌లైటింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి పరిష్కారంగా భారతదేశపు అతిపెద్ద ఐటి సేవల సంస్థ టీసీఎస్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

కొత్త ప్లాన్ ఇదే..

కొత్త ప్లాన్ ఇదే..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గిగ్గింగ్ గిగ్స్ (GIGs) అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని ద్వారా ఉద్యోగులకు ఆదాయం రానుంది. సైట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. త్వరలో TCS ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మూన్‌లైటింగ్ సమస్యకు ముగింపు పలుకుతుందని TCS యాజమాన్యం భావిస్తోంది. TCS ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌ను సెటప్ చేయడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoCs)పై పని చేస్తోంది.

 అదనపు అవకాశాలు..

అదనపు అవకాశాలు..

TCS ఉద్యోగులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని రకాల సాంకేతిక పనిని చేయగలరు. అయితే వారు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో మాదిరిగా క్లయింట్‌లతో నేరుగా మాట్లాడలేరని కంపెనీ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఇదే విధంగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు యాక్సిలరేట్ అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా అదనపు పని చేయడానికి అవకాశం ఉంటుందని ఇన్ఫోసిస్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

డబ్బులు ఉండవు..

డబ్బులు ఉండవు..

TCS కొన్ని క్లిష్టమైన పనులను క్రౌడ్ అవుట్‌సోర్స్ చేయగలదు. ఇది ఉద్యోగులకు ఇవ్వబడుతుంది. కానీ ఈ అదనపు టాస్క్‌లకు నగదు రూపంలో రివార్డ్ చేయబడదు. బదులుగా ఇతర మార్గాల్లో తగిన ప్రయోజనాలను అందించడానికి ప్రణాళిక చేయబడిందని TCS HR విభాగం సీనియర్ హెడ్ మిలింద్ లక్కడ్ చెప్పారు.

సీవోవో సీరియస్ కామెంట్స్..

సీవోవో సీరియస్ కామెంట్స్..

మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే కెరీర్‌ను నాశనం అవుతుందనే సానుభూతితో TCS సీరియస్ చర్యలు తీసుకోవటం లేదని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం అన్నారు. అయితే కంపెనీ ఒకేసారి రెండు ఉద్యోగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని, అతి ఉద్యోగి నైతికతకు సంబంధించిన విషయమని అన్నారు. యువ టెక్కీలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఒక ఉద్యోగిని నియమించుకున్న తర్వాత వారిపై ఆరు నెలల పాటు కంపెనీ శిక్షణ కోసం వారిపై డబ్బు వెచ్చిస్తుందని అన్నారు.

Read more about: tcs jobs moonlighting it jobs
English summary

TCS: చక్కటి ఆలోచనతో TCS.. మూన్‌లైటింగ్ కు ఇదే పరిష్కారం.. టెక్కీల్లో కొత్త ఆనందం.. | tcs offering other work sources to stop moonlighting coo commented seriously

tcs offering other work sources to stop moonlighting coo commented seriously
Story first published: Monday, October 17, 2022, 19:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X