For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS Jobs: డిగ్రీ పూర్తైన వారికి టీసీఎస్ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా.. బ్యాక్ లాగ్స్ ఉన్నా..

|

TCS Jobs: దేశీయ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ TCS నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. దేశంలో అన్ని లోకేషన్లలో ఉన్న ట్రెయినీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు సాధారణ డిగ్రీ చేసిన వారికి సైతం రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

 ఉద్యోగ ఖాళీలు ఎక్కడెక్కడంటే..

ఉద్యోగ ఖాళీలు ఎక్కడెక్కడంటే..

దేశ వ్యాప్తంగా టీసీఎస్ కు ఉన్న వివిధ నగరాల్లో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, దిల్లీ, ముంబయి, నోయిడా, పూణె, కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, గురగ్రామ్, నాగ్ పూర్ నగరాల్లో అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానాల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించింది.

విద్యార్హతలు ఇవే..

విద్యార్హతలు ఇవే..

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి, ఏడవ తరగతి, డిప్లమా, గ్రాడ్యూయేషన్, పోస్ట్ గ్రాడ్యూయేషన్లలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. అభ్యర్థులు దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, బీఈ, ఎంసీఏ, ఎంటెక్, Master of Science (M.Sc. / M.S.) పూర్తి చేసి ఉండాలని వెల్లడించింది. కేవలం ఒక్క బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు సైతం అర్హులేనని కంపెనీ స్పష్టం చేసింది. 2015 నుంచి 2023 బ్యాచ్ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించింది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

1. టీసీఎస్ అధికారిక వెబ్ సైట్ లో TCS NextStep(https://nextstep.tcs.com/campus/#/) ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.

2. ఆ తరువాత ముందుగా కొత్త యూజర్ గా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

3. లాగిన్ అయిన తరువాత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసేందుకు సబ్‌మిట్‌ అ‍య్యాక అప్లై ఫర్‌ డ్రైవ్‌, న్యూ యూజర్‌ అయితే రిజిస్ట్రేషన్ తరువాత ఐటీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి.

4. తరువాత ఇంటర్వ్యూ విధానం కోసం ఆఫ్ టెస్ట్ లేదా ఇన్ సెంటర్ ఆఫ్టన్ ఎంపిక చేసుకోవాలి.

5. అప్లికేషన్ స్టేటస్ తనిఖీ చేసేందుకు ట్రాక్ యువర్ అప్లికేషన్ ఎంపికపై క్లిక్ చేసి దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు.

English summary

TCS Jobs: డిగ్రీ పూర్తైన వారికి టీసీఎస్ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా.. బ్యాక్ లాగ్స్ ఉన్నా.. | tcs offering jobs to freshers and degree graduates with TCS NQT 2023 as trainees

TCS NQT 2023 Hiring As Freshers of Any Degree Graduates
Story first published: Tuesday, August 16, 2022, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X