For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీసా చర్యలు కఠినతరం, అమెరికాలో 20,000 మంది స్థానికులకు టీసీఎస్ ఉద్యోగాలు

|

గత అయిదేళ్లలో అమెరికాలో 20వేల మంది స్థానికులకు తాము ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తెలిపింది. అమెరికా ఐటీ సేవలు, కన్సల్టింగ్ రంగంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. తాము వర్కింగ్ వీసాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించామని అభిప్రాయపడింది.

అమెరికాలో చదివితేనే H1B వీసాలో ప్రాధాన్యత: బిల్లులో కీలక అంశాలు, మనపై ప్రభావం ఎలా?అమెరికాలో చదివితేనే H1B వీసాలో ప్రాధాన్యత: బిల్లులో కీలక అంశాలు, మనపై ప్రభావం ఎలా?

ఆయా దేశాల మార్కెట్‌కు అనుగుణంగా..

ఆయా దేశాల మార్కెట్‌కు అనుగుణంగా..

గత కొన్నేళ్లుగా డెలివరీ పద్ధతులను సవరించామని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిలింద్ లక్కడ్ అన్నారు. ఏ విపణి అవసరాలకు తగినట్లు ఆ విధంగా తమ బృందాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం తాజా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకొని, కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. 2019-20లో అయితే సాధారణంగా తీసుకునే వారి కంటే రెండున్నర రెట్లు అధికంగా ఎంపిక చేశామన్నారు.

అమెరికాలో ఎక్కువమందిని నియమించుకున్న సంస్థల్లో

అమెరికాలో ఎక్కువమందిని నియమించుకున్న సంస్థల్లో

గత అయిదేళ్లలో అమెరికాలో ఎక్కువమందిని స్థానికులనే నియమించుకోవడం ద్వారా వీసాపై ఆధారపడటం తగ్గించినట్లు తెలిపారు. తాము లోకలైజేషన్ ప్రోగ్రాంను వేగవంతం చేశామన్నారు. అమెరికాలో ఎక్కువ మందిని నియమించుకున్న అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో తమ సంస్థ కూడా ముందుందని చెప్పారు. వీసాలపై ఆధారపడటం గత కొంతకాలంగా తగ్గించడం వల్ల తమకు రిస్క్ కూడా అదే క్రమంలో తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో అమెరికాలో ఉన్న సంస్థలు అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం చెప్పడం, తాజాగా అమెరికాలో చదివిన నిపుణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చట్టం తీసుకు వస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న కంపెనీలలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు అనే విషయానికి ప్రాధాన్యత పెరిగింది.

వర్క్ వీసా నిబంధనలు కఠినతరం

వర్క్ వీసా నిబంధనలు కఠినతరం

గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలు అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లలో స్థానిక నియామకాలను గణనీయంగా పెంచాయని, ఎందుకంటే వివిధ దేశాలు వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఆదాయం రూ.1.57 లక్షల కోట్లు కాగా, ఇందులో అమెరికా వాటా 52.2 శాతంగా ఉంది. 30.6 శాతం వాటా ఐరోపా నుండి వస్తోంది. భారత్ నుండి 5.7 శాతం, ఇతర ప్రాంతాల నుండి 11.5 శాతం రెవెన్యూ ఉంది.

English summary

వీసా చర్యలు కఠినతరం, అమెరికాలో 20,000 మంది స్థానికులకు టీసీఎస్ ఉద్యోగాలు | TCS hired over 20,000 employees in US in last five years

India's largest software services firm Tata Consultancy Services (TCS) has hired over 20,000 employees in the US over the last five years, which has reduced its work visa dependency and de-risked business significantly.
Story first published: Monday, May 25, 2020, 7:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X