For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు

|

టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. గతంలోను యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టిన టీసీఎస్, ఆ తర్వాత మళ్లీ రెండో స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి అగ్రస్థానంలోకి వచ్చింది. గతంలో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలు ప్రకటించడంతో అక్టోబర్ నెలలో షేర్ ధర దూసుకెళ్లింది.

ఆ సమయంలో కంపెనీ షేర్ వ్యాల్యూ 3 శాతానికి పైగా లాభపడి రూ.2,818 వద్ద ముగిసింది. షేర్ దూకుడుతో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లను దాటింది. ఆ సమయంలో ప్రపంచ అత్యంత విలువైన ఐటీ సంస్థగా అవతరించింది. ఇప్పుడు మరోసారి యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది.

ప్రపంచ టాప్ ఐటీ కంపెనీగా.. యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టిన TCSప్రపంచ టాప్ ఐటీ కంపెనీగా.. యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టిన TCS

టీసీఎస్ ఆనందం కాసేపు

టీసీఎస్ ఆనందం కాసేపు

టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు (సోమవారం, జనవరి 25) 170 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ఆ తర్వాత షేర్ కాస్త తగ్గింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 167 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెరికన్-ఐరిష్ మల్టీనేషనల్ ఐటీ సంస్థ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 168 బిలియన్ డాలర్లుగా నమోదయింది. టీసీఎస్ నెంబర్ వన్ స్థానం కాసేపు మాత్రమే నిలిచింది.

టీసీఎస్ ఆల్ టైమ్ గరిష్టం

టీసీఎస్ ఆల్ టైమ్ గరిష్టం

టీసీఎస్ నేడు ఆల్ టైమ్ గరిష్టం రూ.3,339ని తాకింది. ఆ సమయంలో మార్కెట్ క్యాప్ పరంగా యాక్సెంచర్‌ను దాటేసింది. అయితే మధ్యాహ్నం సెషన్‌లో స్టాక్ రూ.3,318 వద్ద ఉంది. దీంతో టీసీఎస్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్ల కంటే కిందకు వచ్చింది. ఇక టీసీఎస్ భారత అతిపెద్ద ఐటీ సంస్థ. అన్ని లిస్టెడ్ కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే రిలయన్స్ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్ రెండో స్థానంలో ఉంది.

భారత టాప్ 5 కంపెనీలు-మార్కెట్ క్యాప్

భారత టాప్ 5 కంపెనీలు-మార్కెట్ క్యాప్

ఐటీ సంస్థల్లో భారత్ అతిపెద్ద మార్కెట్ క్యాప్ టీసీఎస్‌దే. టీసీఎస్ 167 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్ 78 బిలియన్ డాలర్లు, HCL టెక్నాలజీస్ 36 బిలియన్ డాలర్లు, విప్రో 33 బిలియన్ డాలర్లు, టెక్ మహీంద్రా 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో భారీ పతనం అనంతరం టీసీఎస్ మార్కెట్ క్యాప్ 82 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.

టీసీఎస్ టార్గెట్ ధర

టీసీఎస్ టార్గెట్ ధర

వివిధ బ్రోకరేజీ సంస్థలు టీసీఎస్ టార్గెట్ ధరను పెంచాయి. జియోజిత్ బీఎన్‌పీ పరిబాస్ బై రికమండేషన్ రూ.3,667, యాక్సిస్ డైరెక్ట్ బై రికమండేషన్ రూ.3,550, ప్రభుదాస్ లీలాధర్ బై రికమండేషన్ రూ.3,586. రెండో త్రైమాసికంలో అదరగొట్టిన టీసీఎస్ మూడో త్రైమాసికంలోను భారీ లాభాలు ఆర్జించింది.

English summary

మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు | TCS Becomes World's Most Valued IT Company, Surpassing Accenture

Indian software services major Tata Consultancy Services (TCS) on Monday again became the most valued company in its sector globally, surpassing Accenture.
Story first published: Monday, January 25, 2021, 15:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X