For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్‌యాప్‌లోకి బిగ్ బాస్కెట్, రూ.9500 కోట్లతో టాటా చేతికి 68% వాటా

|

సూపర్ మార్కెట్ గ్రోసరీ సరఫరా సంస్థ బిగ్ బాస్కెట్‌లో 68 శాతం వాటాను దక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీల్ వ్యాల్యూ రూ.9300 కోట్ల నుండి రూ.9500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆన్‌లైన్ గ్రాసరీ సోర్స్‌లో ఇది అతిపెద్ద డీల్‌గా భావిస్తున్నారు. బిగ్ బాస్కెట్ వ్యాల్యూ రూ.13,500 కోట్లు(1.85 బిలియన్ డాలర్లు) వద్ద దీనిని కొనుగోలు చేయనున్నారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా, హరిమీనన్ నేతృత్వంలోని ఈ కంపెనీ 200 నెలల క్రితం యూనికార్న్ జాబితాలో చేరింది. కంపెనీ వ్యాల్యూ 1 బిలియన్ డాలర్ల దాటితే యూనీకార్న్‌గా చెబుతారు.

LPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధరLPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధర

మెజార్టీ వాటా

మెజార్టీ వాటా

భారత రిటైల్ రంగంలో ప‌ట్టుకోసం అమెజాన్, రిల‌య‌న్స్ రిటైల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పోటీ పడుతుండగా ఇప్పుడు టాటా స‌న్స్... బిగ్ బాస్కెట్ ద్వారా పోటీలోకి వస్తోంది. ఈ ఆన్‌లైన్ గ్రాస‌రీ స్టార్టప్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. బిగ్‌బాస్కెట్‌లో వాటాల కొనుగోలు ఒప్పందంపై టాటా గ్రూప్ సంత‌కం చేసింది. రూ.13,500 కోట్ల బిగ్ బాస్కెట్‌ను రూ.9,500 కోట్లతో 68 శాతం వాటా దక్కించుకోనుందని వార్తలు వచ్చినప్పటికీ, టాటా గ్రూప్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 2018లో 16 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ డీల్ తర్వాత భార‌త స్టార్ట‌ప్ ఎకో-సిస్ట‌మ్స్‌లో టాటా-బిగ్‌బాస్కెట్ డీల్ అతి పెద్దదిగా ఉంది.

అలీబాబా ఔట్, టాటా ఇన్

అలీబాబా ఔట్, టాటా ఇన్

సమాచారం మేరకు టాటా స‌న్స్-బిగ్ బాస్కెట్ కంపెనీలు త‌మ మ‌ధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధిత నియంత్ర‌ణ సంస్థ‌ల ఆమోదం కోర‌నున్నాయి. బిగ్ బాస్కెట్ నుండి చైనాకు చెందిన అలీబాబా వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. దేశీయంగా చైనా పెట్టుబ‌డుల‌పై తాజాగా భార‌త్ నిషేధం విధించ‌డంతో బిగ్ బాస్కెట్‌లో తమ 27 శాతం వాటాను అలీబాబా ఉపసంహరించుకుంది. ఆ స్థానంలో టాటా గ్రూప్ వస్తోంది. ఈ డీల్ కుదిరితే ఆన్ లైన్ గ్రోసరీ విభాగంలో అతిపెద్ద కొనుగోలు కానుంది.

సూపర్ యాప్‌లోకి బిగ్ బాస్కెట్

సూపర్ యాప్‌లోకి బిగ్ బాస్కెట్

ఈ-కామర్స్ వ్యాపారంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్‌లోని కన్జూమర్ వ్యాపారాలను కలుపుతూ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. తద్వారా టాటా గ్రూప్‌లోని రిటైల్, ఆన్‌లైన్ వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తోంది. ఇప్పుడు ఈ సూపర్ యాప్‌లోకి బిగ్ బాస్కెట్ రానుంది. ఈ డీల్ నాలుగైదు వారాల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

English summary

సూపర్‌యాప్‌లోకి బిగ్ బాస్కెట్, రూ.9500 కోట్లతో టాటా చేతికి 68% వాటా | Tatas to buy 68 percen in BigBasket for Rs 9,500 crore, deal likely in 4 to 5 weeks

The Tata Group is in the final stages of acquiring a majority stake of 68 per cent in Supermarket Grocery Supplies, which runs and operates online grocery brand BigBasket, for about Rs 9,300-9,500 crore, said a source close to the development.+
Story first published: Wednesday, February 17, 2021, 9:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X