For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3,000 మంది ఉద్యోగులను తొలగించనున్న టాటా స్టీల్!

|

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత్ పైన కూడా ఉంది. వివిధ రంగాల్లో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మందగమనం నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా, ఉక్కు కంపెనీ టాటా స్టీల్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే భారత్‌లో కాదు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం నేపథ్యంలో అంతటా ఇదే పరిస్థితి ఉంది. టాటా స్టీల్ ఐరోపాలో దాదాపు 3వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశముంది.

భారత సాఫ్టువేర్ రంగంలో 40,000 ఉద్యోగాలు మటాష్!భారత సాఫ్టువేర్ రంగంలో 40,000 ఉద్యోగాలు మటాష్!

సంస్థ పునర్నిర్మాణానికి తోడు ఖర్చుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూరోపియన్ యూనిట్స్‌ల్లో భారీగా ఉద్యోగుల్ని తొలగించనుంది. డిమాండ్ లేమి, అధిక వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ ఆడమ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Tata Steel plans to scrap up to 3,000 jobs in Europe

ఐరోపా ప్రాంతంలో మూడువేల వరకు ఉద్యోగాల వరకు తగ్గించనున్నామని, వీటిలో మూడో వంతు ఆఫీస్ బేస్డ్ రోల్స్‌లో ఉన్నవారినే తొలగించే అవకాశం ఉందని తెలిపింది. తయారీ కేంద్రాలను పూర్తిగా మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ఐరోపాలో మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టాటా స్టీల్ జూన్ నెల నుండి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తీవ్రమైన మార్కెట్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతోందని, కార్బన్ న్యూట్రల్ స్టీల్ మేకింగ్ వైపు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ మార్పులు అవసరమని కంపెనీ తెలిపింది.

English summary

3,000 మంది ఉద్యోగులను తొలగించనున్న టాటా స్టీల్! | Tata Steel plans to scrap up to 3,000 jobs in Europe

Tata Steel plans to cut up to 3,000 jobs across its European operations, the company said on Monday, as the sector wrestles with excess supply, weak demand and high costs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X