For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19, ద్రవ్యనిల్వలు ఉండేలా చూసుకోండి: కంపెనీలకు టాటా కీలక సూచనలు

|

ప్రస్తుత కరోనా మహమ్మారి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, తమ గ్రూప్‌లోని ఇతర కంపెనీలన్నీ కూడా తగినంత ద్రవ్య నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని టాటా సన్స్ మార్గనిర్దేశనం చేసింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చెందిన అన్ని కంపెనీల సీఈవోలకు దిశానిర్దేశనం చేశారు.

ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోవద్దంటే, కంపెనీలోనే ఉంటారు కానీ: ప్రభుత్వానికి కీలక సూచన

ఆర్థిక సంక్షోభం దిశగా

ఆర్థిక సంక్షోభం దిశగా

కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్న నేపథ్యంలో చంద్రశేఖరన్ సూచనలు చేశారు. 113 బిలియన్ డాలర్ల కలిగిన టాటా గ్రూప్ మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలన్నారు. వ్యాపారాలపై కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కాపెక్స్ ప్రణాళికలపై నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలని, మూడు నుంచి ఆరునెలల వరకు ఈ ప్రభావం ఉంటుదనే గుర్తుంచుకోవాలన్నారు.

ద్రవ్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి

ద్రవ్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి

కరోనా ప్రభావాన్ని అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తగ్గినంత ద్రవ్యాన్ని ఉంచుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కంపెనీల్లో పనిచేస్తోన్న సీఈవోలు అందరూ సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారని, వ్యాపారాలలో ఒకరికొకరు సహకారంతో పాటు, డిజిటలైజేషన్ పైన మరింత దూకుడుగా వ్యవహరించాలన్నారు.

ప్రతి దేశానికి దెబ్బ

ప్రతి దేశానికి దెబ్బ

2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని గ్రూప్స్ కూడా నగదును పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. కరోనా కారణంగా ప్రతి దేశం కూడా ఉద్యోగాల పరంగా దెబ్బతిననుందని, అలాగే అన్ని దేశాల జీడీపీపై ప్రభావం ఉంటుందని చంద్రశేఖరన్ అన్నారు.

దేశానికి 250 బిలియన్ డాలర్ల దెబ్బ

దేశానికి 250 బిలియన్ డాలర్ల దెబ్బ

భారతదేశం విషయానికి వస్తే దాదాపు 250 బిలియన్ డాలర్ల జీడీపీ కుంగిపోతుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా గాడిలో పెట్టేందుకు, సంక్షోభాన్ని ఎధుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాకు ముందే ట్రాన్సాక్షన్స్ మందగించాయని, ఆర్థిక వ్యవస్థలో అప్పులు పెరిగాయన్నారు. ఎంఎస్ఈలు, మైక్రో ఎంటర్‌ప్రెన్యూయర్స్ బాగా దెబ్బతిన్నాయని, వాటి మనుగడకు మన మద్దతు అవసరమన్నారు.

అలా అయితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది

అలా అయితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది

కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కార్మికులు తిరిగి పనిలోకి వచ్చేలా ఆ రంగాలను పునరుద్ధరించాలని చంద్రశేఖరన్ సూచించారు. తగినంత ద్రవ్యంతో పాటు సకాలంలో ఉద్దీపనలు ఎంతో అవసరమన్నారు. మారటోరియం ద్వారా ఆహార భద్రతతో పాటు మన ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన వృద్ధి చెందుతుందన్నారు.

ఉద్దీపనలు అవసరం

ఉద్దీపనలు అవసరం

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనిశ్చితి ఎంతకాలం ఉంటుందో, ఆరోగ్య సంక్షోభం ఏ మేరకు ఉంటుందో అప్పుడే చెప్పలేమన్నారు. నిత్యావసరాలు, రిటైల్ అందించినప్పటికీ దేశమంతా తిరిగి వర్కింగ్ మోడ్‌లోకి రావడానికి ఉద్దీపనలు అవసరమన్నారు.

ఇండియన్ హోటల్స్, విస్తారాపై

ఇండియన్ హోటల్స్, విస్తారాపై

కరోనా కారణంగా ఎక్కువగా విమానయానం, హోటల్ రంగంపై భారీ ప్రభావం పడింది. టాటా గ్రూప్‌కు చెందిన విస్తారా, ఇండియన్ హోటల్స్ పైన ప్రభావం గురించి కూడా చంద్రశేఖరన్ స్పందించారు. వ్యాపార లాభదాయకం గ్రూప్‌లోని వ్యక్తిగత సంస్థలదేనని చెప్పారు. ప్రతి సంస్థ హెచ్‌ఆర్ పాలసీ, రెవెన్యూ ప్లానింగ్, నగదు ప్రవాహాల్ని నిర్వహించే మార్గాలను సమీక్షిస్తుందన్నారు. తమ గ్రూప్‌లోని కంపెనీలన్నీ ఒకేతాటిపై ఉన్నప్పటికీ ప్రతి కంపెనీ వ్యాపారవృద్ధికి ఆయా కంపెనీలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటాయన్నారు.

English summary

Tata Sons tells group companies to halt capex plans, conserve cash

Tata Sons has carried out an extensive review of its group firms as businesses take a severe hit from coronavirus pandemic which has brought the global economy on its knees.
Story first published: Friday, April 10, 2020, 15:17 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more