For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Air India: ఎయిర్ ఇండియా కోసం టాటాల ఆర్డర్.. కొత్తగా 500 విమానాలు.. ఎందుకంటే..?

|

Air India: దేశంలోని అతిపెద్ద విమానయాక సంస్థగా టాటా గ్రూప్ ఎదుగుతోంది. అయితే తమ కలను నెరవేర్చుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను అత్యంత వేగంగా కంపెనీ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా మాతృసంస్థ టాటా గ్రూప్, తన నియంత్రణలోని అన్ని విమాన కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. దీంతో కంపెనీ ప్రపంచంలోని చాలా గమ్యస్థానాలకు విమానాలను నడిపే అతిపెద్ద రవాణ సంస్థగా ఆవిర్భవించింది.

ముఖ్యమైన ప్రాజెక్ట్..

ముఖ్యమైన ప్రాజెక్ట్..

ఎయిర్ ఇండియాను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి టాటా గ్రూప్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అందుకే టాటా గ్రూప్ ప్రస్తుతం తన ఎలక్ట్రానిక్స్ అండ్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించడం కంటే ఎయిర్ ఇండియాపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. వీలైనంత త్వరగా కంపెనీని లాభాల బాట పట్టించాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కృషి చేస్తున్నారు.

కొత్త విమానాల ఆర్డర్..

కొత్త విమానాల ఆర్డర్..

ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలైన ఎయిర్ బస్, బోయింగ్ నుంచి దాదాపు 500 కొత్త విమానాలను టాటాలు ఎయిర్ ఇండియా కోసం కొనబోతున్నట్లు సమాచారం. వీటిలో 400 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 100 వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ కు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వీటి విలువ దాదాపుగా 100 బిలియన్ డాలర్లు అవుతుందని సమాచారం. బల్క్ ఆర్డర్ కావటంతో కంపెనీలు కొంత ధర తగ్గించే అవకాశం ఉంది.

3 in 1..

3 in 1..

కంపెనీ ఖర్చుల మదింపు, మెరుగైన సేవలు, ట్రాకింగ్, మెయింటెనెన్స్ వంటి అనేక వ్యూహాత్మక కారణాలతో టాటాలు తమ పోర్ట్ ఫోలియోలోని విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అనే మూడు విడివిడి కంపెనీలను ఒకటిగా విలీనం చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైతే కొత్తగా ఏర్పడే కంపెనీ దేశంలో 2వ అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఆవిర్భవించనుంది.

తిరుగులేని సంస్థగా..

తిరుగులేని సంస్థగా..

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరపడంలో టాటా గ్రూప్ విజయవంతమైంది, ఇప్పుడు టాటా గ్రూప్ విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అనే 3 కంపెనీలను ఎయిర్ ఇండియా అనే ఒక కంపెనీ కింద విలీనం చేసి దేశంలో 2వ అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీగా అవతరించాలని యోచిస్తోంది. విలీనం తర్వాత ఎయిర్ ఇండియా వద్ద 111 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 24 విమానాలు, విస్తారాలో 54 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్ ఏషియా ఇండియా కింద ఉన్న 28 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కలుపుకుని టాటా గ్రూప్ మొత్తం 217 విమానాలను కలిగి ఉండనుంది. వీటికి తోడు ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ చేసిన 500 విమానాలు కంపెనీకి మరింత బలాన్ని చేకూర్చనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

English summary

Air India: ఎయిర్ ఇండియా కోసం టాటాల ఆర్డర్.. కొత్తగా 500 విమానాలు.. ఎందుకంటే..? | Tata's to order 500 new aircrafts for air india to increase fleet know details

Tata's to order 500 new aircrafts for air india to increase fleet know details
Story first published: Monday, December 12, 2022, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X