For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata Motors: కారు కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. ఎందుకంటే..!

|

మీరు కారు కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే కొనేయండి.. లేకుంటే మీ జేబులకు మరింతగా చిల్లులు పడొచ్చు. ఎందుకంటే జనవరి నుంచి చాలా కంపెనీలు వాహనాల ధరను పెంచే అవకాశం ఉంది. మంచి డిమాండ్ ఉన్న వాహనాల ధరల్ని ఇప్పటికే పెంచాయి. తాజాగా టాటా దేశీయ వాహనాల తయారీ సంస్థ టాటా మోటర్స్ కూడా జనవరి నుంచి ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచాలని యోచిస్తుంది.

ఏప్రిల్ 1 నుంచి

ఏప్రిల్ 1 నుంచి

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కఠినమైన ఉద్గార నిబంధనలు అమలులోకి వస్తుండడంతో ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని చూస్తోందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ధరల సవరణ వల్ల సంవత్సరంలో పెరిగిన ముడి వస్తువుల ప్రభావాన్ని కూడా భర్తీ చేయవచ్చని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ - ప్యాసింజర్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ శైలేష్ చంద్ర అన్నారు. కమొడిటీస్ ధరలు పెరగడం వల్ల తమపై అధిక భారం పడుతోందని, అందుకే రేట్లు పెంచాల్సి వస్తోందని చెప్పారు.

కమొడిటీస్ ధరలు

కమొడిటీస్ ధరలు

"ఈ సంవత్సరంలో కమొడిటీస్ ధరలు భారీగా పెరిగాయి" అని చంద్ర అన్నారు. బ్యాటరీ ధరలు కూడా పెరిగాయని గుర్తు చేశారు.అంతేకాకుండా, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోడల్ శ్రేణి వాహనాలను తయారు చేయాలంటే మరింత ఖర్చు ఉంటుందన్నారు. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్‌లో పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి అనేక రకాల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ టియాగో EV, Nexon EV వంటి ఉత్పత్తులతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉంది.

ఆన్-బోర్డ్ స్వీయ-నిర్ధారణ

ఆన్-బోర్డ్ స్వీయ-నిర్ధారణ

ఏప్రిల్ 1, 2023 నుంచి వాహనాలు నిజ-సమయ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి ఆన్-బోర్డ్ స్వీయ-నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గారాలపై నిశిత నిఘా ఉంచేందుకు, ఉత్ప్రేరక కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్‌ల వంటి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా పరికరం నిరంతరం కీలక భాగాలను పర్యవేక్షిస్తుంది. వాహనాల్లో వీటిని అమర్చాలంటే ఖర్చు పెరుగుతుంది. అందుకే కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. గత వారం, మారుతీ సుజుకీ కూడా జనవరి నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

English summary

Tata Motors: కారు కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. ఎందుకంటే..! | Tata Motors will increase the prices of passenger vehicles from January 1, 2023

Recently Tata's domestic vehicle manufacturer Tata Motors is also planning to increase the prices of passenger vehicles from January.
Story first published: Tuesday, December 6, 2022, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X