For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి.. ‘టాటా అల్ట్రోజ్’ కారు!

|

'ఆటో ఎక్స్‌పో 2020' మరో వారంలో ఉందనగా.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఓ సరికొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిపేరు 'టాటా అల్ట్రోజ్'. దేశీయంగా తయారై 'ఫైవ్ స్టార్ రేటింగ్' పొందిన కార్లలో ఇది రెండోది కావడం విశేషం. ఇంకా ఆల్ఫా మాడ్యులార్ ప్లాట్‌ఫామ్ (ఏఎంపీ) ఆధారంగా మార్కెట్‌లోకి వచ్చిన మొట్టమొదటి కారు కూడా ఇదే.

అలాగే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టాటా నుంచి వస్తోన్న తొలి కారు కూడా ఇదే. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఉన్న మారుతీ సుజుకీ బాలెనో, హ్యూందాయ్ ఐ 20, హోండా జాజ్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా అద్భుతమైన డిజైన్‌, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్‌ డిజైన్‌తో టాటా మోటార్స్ ఈ అల్ట్రోజ్ ఈవీ కారును తీర్చిదిద్దింది.

tata motors launched its new car altroz in premium hatchback segment

బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా.. పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ఇంజిన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ స్టాండర్డ్ గేర్‌‌బాక్స్‌తో ఈ కారును లాంచ్‌ చేశారు. దేశంలో అతి భద్రమైన తమ ఆల్ట్రోజ్‌ వినియోగదారులకు బంగారం లాంటి అనుభవాన్ని ఇస్తుందని, హాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో ఈ వాహనం తమకు మంచి గుర్తింపునివ్వనుందని కంపెనీ పేర్కొంది.

ఈ టాటా ఆల్ట్రోజ్ కారు.. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌ జెడ్‌, ఎక్స్‌జెడ్‌(ఒ) అంటూ మొత్తం నాలుగు మోడళ్లలో లభించనుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 86 ‌బీహెచ్‌పీ శక్తిని, 113 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 90 బీహెచ్‌పీ శక్తిని, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విభిన్న డ్రైవింగ్ మోడ్స్, 7.0 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్ వీల్ వంటి హంగులు ఈ కారులో ఉన్నాయి.

ఇక భద్రత విషయానికొస్తే, టాటా ఆల్ట్రోజ్ కారులో.. రెండు ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, హైస్పీడ్ లిమిటర్, రియర్ పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్ఈ వెర్షన్ ధరలు - పెట్రోల్ అయితే రూ.5.29 లక్షలు, డీజిల్ అయితే రూ.6.99 లక్షలు. అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన తమ అల్ట్రోజ్ కారు.. వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని, అలాగే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తమకు మంచి గుర్తింపు కూడా తీసుకొస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది.

English summary

సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి.. ‘టాటా అల్ట్రోజ్’ కారు! | tata motors launched it's new car altroz in premium hatchback segment

Tata Motors on Wednesday launched its highly awaited premium hatchback, Altroz with a price tag at ₹5.29 lakh (ex-showroom pan-India). The Altroz is available in five trim levels – XE, XM, XT, XZ and XZ options.
Story first published: Thursday, January 23, 2020, 7:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X