For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata Motors Safari Gold: ఆటోమేటిక్‌లో లభిస్తుందా? ధర ఎంత?

|

న్యూఢిల్లీ: టాప్ కార్ మేకర్స్ కంపెనీ టాటా మోటార్స్.. భారతీయ మార్కెట్‌లో కొత్త లగ్జరీ వాహనాన్ని లాంచ్ చేసింది. టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ కారును దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కారు బేసిక్ ధర 21.89 లక్షల రూపాయలు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ కారు రెండు మోడళ్లలోనూ అంటే మ్యానువల్ గేర్, ఆటోమేటిక్‌లల్లో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ కార్ల సెక్టార్‌లో హైఎండ్, అత్యధిక ధర ఉన్న సెక్టార్‌లో ఉన్న పోటీని ఎదుర్కొనడానికి ఈ మోడల్‌ను లాంచ్ చేసింది టాటా మోటార్స్.

21 లక్షల నుంచి..

21 లక్షల నుంచి..

కారు బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కార్లను బుక్ చేసుకునే వసతి ఉంది. డెలివరీ మొదలు కావడానికి ఇంకో నెలరోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగ ప్రారంభంలో ఈ టాటా సఫారీ గోల్డ్ కారు డెలివరీ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. టాటా సఫారీ ఎక్స్‌జెడ్ గోల్డ్ ప్లస్ మోడల్ కారు మాన్యువల్ మోడ్‌లో లభిస్తుంది. దీని ధర 21.89 లక్షల రూపాయలు. సఫారీ ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ గోల్డ్ వేరియంట్ ఆటోమేటిక్. దీని బేసిక్ ప్రైస్ 23.17 లక్షల రూపాయలుగా నిర్ధారించింది టాటా మోటార్స్ కంపెనీ మేనేజ్‌మెంట్.

అట్రాక్టివ్ కలర్స్..

అట్రాక్టివ్ కలర్స్..

టాటా మోటార్స్ కొత్త సఫారీ గోల్డ్ ఎడిషన్ ప్రస్తుతానికి రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వైట్ గోల్డ్ బ్లాక్, గోల్డ్ వైట్ గోల్డ్ కాంబినేషన్‌లో అందుబాటులో ఉంటాయి. వైట్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ప్రీమియం ఫ్రాస్ట్ వైట్ బాడీ పెయింట్, బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్‌తో లభిస్తుంది. ఇందులోని గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రెయిలింగ్స్, డోర్ హ్యాండిల్స్, టాటా అండ్ సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్‌లో మెరిసిపోతూ కనిపిస్తాయి. బ్లాక్ గోల్డ్‌ కలర్ స్కీమ్‌లో బయటి వైపు మొత్తం కాఫీ బీన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ను కలిగి ఉంటుందీ మోడల్.

వెంటిలేషన్‌పై ఫోకస్..

వెంటిలేషన్‌పై ఫోకస్..

ఇందులో కూడా గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రెయిలింగ్స్, డోర్ హ్యాండిల్స్, టాటా అండ్ సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ ఉంటాయి. టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్‌ కారు టైర్ల కోసం కంపెనీ 18 అంగుళాల చార్‌కోల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించింది. ఇందులో అధునాతన ఫీచర్స్ ఉంటాయి. లెదర్ సీట్లు, ఫస్ట్, సెకెండ్ రోలల్లో వెంటిలేషన్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆండ్రాయిడ్ ఆటో ఓవర్ వై-ఫై, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్ కంపెనీ.

ఐపీఎల్‌లో డిస్‌ప్లే..

ఐపీఎల్‌లో డిస్‌ప్లే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకెండ్ ఫేస్ ఈ రెండు కార్లను కూడా డిస్‌ప్లే కోసం ఉంచబోతోంది. ఈ సీజన్‌లో 'సఫారీ గోల్డ్ హిట్ ఛాలెంజ్' ను కూడా టాటా మోటార్స్ ప్రవేశపెట్టింది. ఓ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టినప్పుడు బంతి కారు లేదా కారు డిస్‌ప్లే పోడియం లేదా సఫారీ గోల్డ్ అనే ఎల్‌ఈడీ కమర్షియల్ బోర్డ్‌ను తాకిన ప్రతీసారీ కూడా టాటా మోటార్స్ కంపెనీ మేనేజ్‌మెంట్- అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు రెండు లక్షల రూపాయలను విరాళంగా అందిస్తుంది.

మార్పుల్లేని ఇంజిన్..

మార్పుల్లేని ఇంజిన్..

కొత్త సఫారీ గోల్డ్ ఇంజిన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు కూడా చోటు చేసుకోలేదు. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను వాడారు. ఇంజిన్ 170 బిహెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది. 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ సెక్టార్‌లో నెలకొన్న పోటీని ఎదుర్కొనడానికి టాటా మోటార్స్ మేనేజ్‌మెంట్- ఈ రెండు వేరియంట్లలో కొత్త సఫారీ గోల్డ్ ఎడిషన్లను విడుదల చేసింది.

English summary

Tata Motors Safari Gold: ఆటోమేటిక్‌లో లభిస్తుందా? ధర ఎంత? | Tata Motors launched a special edition of its Safari priced at Rs 21.89 lakh

Tata Motors launched a special edition of its flagship model Safari priced at Rs 21.89 lakh (ex-showroom) to further spruce up the range ahead of the festive season.
Story first published: Saturday, September 18, 2021, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X