For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata Group: టెక్ బ్యూటీ వ్యాపారంలోకి టాటా గ్రూప్.. నైకా పరిస్థితి అంతేనా..?

|

Tata Group: సాల్ట్ నుంచి శాటిలైట్స్ వరకు అనేక రంగాల్లోకి విస్తరించిన టాటా గ్రూప్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. బ్యూటీ రంగంలో టెక్ స్టోర్లను తెరిచేందుకు సిద్ధమైంది. టాటాల నయా వ్యూహం నైకా కంపెనీని దెబ్బతీస్తుందా.. అసలు వారిపై ఎంత ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

 టాటాల సన్నాహాలు..

టాటాల సన్నాహాలు..

టాటా గ్రూప్ దేశవ్యాప్తంగా కనీసం 20 బ్యూటీ టెక్ స్టోర్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్టోర్లలో వర్చువల్ మేకప్ కియోస్క్‌లు, డిజిటల్ స్కిన్ టెస్ట్‌ల సౌకర్యాలు స్టోర్లలో అందిస్తోంది. కొనుగోలుదారులు ఈ స్టోర్ల ద్వారా ప్రీమియం కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తి ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

 విదేశీ బ్రాండ్స్..

విదేశీ బ్రాండ్స్..

16 బిలియన్ డాలర్ల బ్యూటీ మార్కెట్లో టాటా గ్రూప్ నుంచి ఉత్పత్తులను చూసే కొనుగోలుదారులు సెఫోరా, నైకాతో పోటీ పడతారు. బ్యూటీ కాన్షియస్ ఉన్న కంపెనీ 18-45 ఏళ్ల మధ్య వయస్కులను టాటా టార్గెట్ చేయనుంది. వారు ఎస్టీ లాడర్స్ MAC, బాబీ బ్రౌన్ వంటి విదేశీ బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ది హానెస్ట్ కంపెనీ, ఎల్లిస్ బ్రూక్లిన్, గల్లిని వంటి ప్రముఖ బ్రాండ్స్ సైతం ఇందులో భాగస్వాములుగా ఉండవచ్చని తెలుస్తోంది.

 టాటాల వ్యూహం..

టాటాల వ్యూహం..

టాటా గ్రూప్ తన కొత్త స్టోర్‌లకు ప్రత్యేకమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి రెండు డజనుకు పైగా కంపెనీలతో చర్చలు జరుపుతోందని సమాచారం. అయితే కంపెనీల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. టాటా గ్రూప్ దాని ప్రణాళికాబద్ధమైన బ్యూటీ స్టోర్‌ల గురించి ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ది హానెస్ట్ కంపెనీ, ఎల్లిస్ బ్రూక్లిన్, గల్లిని వంటి కంపెనీల ప్రతినిధులు సైతం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

దేశ రాజధానిలో..

దేశ రాజధానిలో..

దేశ రాజధాని ఢిల్లీ వంటి పెద్ద మెట్రో నగరాల్లో ముందుగా కంపెనీ దుకాణాలను ప్రారంభించవచ్చు. మొదటి బ్యూటీ టెక్ స్టోర్ మార్చి నాటికి తెరవబడుతుంది. ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి విస్తరణ ప్రారంభమవుతుందని సమాచారం. టాటాలు మెుత్తంగా తమ వ్యూహంలో భాగంగా 40 స్టోర్లను తెరిచే అవకాశం ఉంది. ఈ ప్రణాళికల గురించి తెలిసిన వ్యక్తి మీడియాకు ఈ సమాచారాన్ని అందించారు. నైకాకు ఇది పెద్ద దెబ్బని నిపుణులు భావిస్తున్నారు.

English summary

Tata Group: టెక్ బ్యూటీ వ్యాపారంలోకి టాటా గ్రూప్.. నైకా పరిస్థితి అంతేనా..? | Tata group soon going to start tech beauty stores in indian cities

Tata group soon going to start tech beauty stores in indian cities
Story first published: Wednesday, November 16, 2022, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X