For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bisleri: టాటాల గూటిలో బిస్లరీ వాటర్.. ఖరారైన భారీ డీల్..! పరిగెడుతున్న షేర్..

|

Bisleri: దేశీయ వాటర్ మార్కెట్లో మరో సంచలన డీల్ జరగబోతోంది. అవును ప్రఖ్యాత ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లరీని టాటాలు వశం చేసుకోబోతున్నారు.

మెగా డీల్..

మెగా డీల్..

టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ త్వరలో బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను సొంతం చేసుకోనుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.7000 కోట్లకు ఖరారైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. మార్కెట్ పరిశోధన, సలహాదారు TechSci రీసెర్చ్ నివేదిక ప్రకారం.. FY21లో భారతీయ బాటిల్ వాటర్ మార్కెట్ విలువ సుమారు రూ.19,315 కోట్లుగా ఉంది.

అతిపెద్ద ప్లేయర్..

అతిపెద్ద ప్లేయర్..

ఈ డీల్ పూర్తైతే టాటాలు ఈ రంగంలో అతిపెద్ద ప్లేయర్ గా అవతరించనుంది. అయితే ఈ డీల్ పై రెండు కంపెనీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) క్రిందకు వస్తుందని వివరించండి. కంపెనీకి ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్, టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో వంటి బ్రాండ్‌లతో హైడ్రేషన్ విభాగంలో ప్యాక్ చేయబడిన మినరల్ వాటర్‌ విక్రయ వ్యాపారంలో ఉంది.

పెద్ద మార్కెట్..

పెద్ద మార్కెట్..

బాటిల్ వాటర్ వినియోగదారులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో టాటాలకు ఈ డీల్ కలిసొచ్చే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్‌లో సాధారణ ఓపెన్ వాటర్ కంటే మినరల్ వాటర్ స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతోంది. కోకాకోలా కిన్లే, పెప్సికో ఆక్వాఫినా, పార్లే ఆగ్రోస్ బెయిలీస్, IRCTC రైల్ నీర్ మార్కెట్లో పోటీదారులుగా ఉన్నాయి.

లాభపడిన స్టాక్..

లాభపడిన స్టాక్..

టాటాల బిల్లరీ కొనుగోలు డీల్ వివరాలు వెలువడటంతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ స్టాక్ లాభపడింది. ఉదయం 11.05 గంటల సమయంలో స్టాక్ 2 శాతం మేర లాభపడి రూ.785.50 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం ఇంట్రాడే సమయంలో స్టాక్ రూ.791 మాక్కును తాకింది. టాటాలకు ఈ మార్కెట్లో మంచి నెట్ వర్క్, మార్కెట్ షేర్ ఉండటంతో ఇన్వెస్టర్లకు రానున్న కాలంలో లాభదాయకమని బ్రోకరేజ్ సంస్థలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

English summary

Bisleri: టాటాల గూటిలో బిస్లరీ వాటర్.. ఖరారైన భారీ డీల్..! పరిగెడుతున్న షేర్.. | tata group's Bisleri aquisition under pipeline for 7000 crores deal

tata group's Bisleri aquisition under pipeline for 7000 crores deal
Story first published: Thursday, November 24, 2022, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X