న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక పౌర విమానయాన సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోన్న టాటా గ్రూప్ కంపెనీలు.. తమ దూకుడును కొనసాగిస్తోన్నాయి. తాజాగా- దేశీయ టెలికం నెట్‌వర్క్ ఫర్మ్ తేజాస్ నెట్‌వర్క్స్‌లో భారీ పెట్టుబడులను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఆ కంపెనీ యాజమాన్యానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. తేజాస్ నెట్‌వర్క్స్‌లో కనీసం 26 శాతం మేర వాటాలను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ సంస్థలు నిర్ణయించాయి. దీని విలువ 1,038 కోట్ల రూపాయలు.

నాలుగు లక్షలకు పైగా ఈక్విటీ షేర్లు..
టాటా సన్స్ గ్రూపుల్లో ఒకటైన పానాటోన్ ఫిన్వెస్ట్ అండ్ అకశాస్త టెక్నాలజీస్ సంయుక్తంగా ఈ ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి. 258 కోట్ల రూపాయల మేర విలువ చేసే తేజాస్ నెట్‌వర్క్స్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలనేది టాటా సన్స్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పానాటోన్ ఫిన్వెస్ట్ అండ్ అకశాస్త టెక్నాలజీస్ జాయింట్‌గా తేజాస్ నెట్‌వర్క్స్ యాజమాన్యానికి క్యాష్ ఆఫర్ ఇచ్చాయి. ఈ ఆఫర్ ప్రకారం.. తేజాస్ నెట్‌వర్క్స్‌కు చెందిన 4,02,55,631 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

1000 కోట్లకు పైగా
మొత్తం ఆ కంపెనీకి ఉన్న ఈక్విటీ షేర్లతో పోలిస్తే.. దీని పరిమాణం 26 శాతం మేర ఉంటుంది. ఈ 4,02,55,631 ఈక్విటీ షేర్ల విలువ 258 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఈ మొత్తాన్ని 10,38,59,52,798 రూపాయలకు కొనుగోలు చేయాలనేది టాటా సన్స్ గ్రూప్ భావిస్తోంది. ఈ మేరకు తేజాస్ నెట్‌వర్క్స్‌కు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని తేజాస్ నెట్‌వర్క్స్ నిర్ధారించింది కూడా. ఈ మేరకు ఈ ఏడాది జులై 29వ తేదీ నాడే ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదివరకే సంప్రదింపులు..
తమ కంపెనీలో 1,890 కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ప్రయత్నాలు సాగిస్తోందని తెలిపింది. దీనికోసం పానాటోన్ ఫిన్వెస్ట్ కంపెనీ తమతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఓటింగ్ రైట్స్ అండ్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలనేది టాటా సన్స్ లక్ష్యమని స్పష్టం చేసింది. పానాటోన్ ఫిన్వెస్ట్ అండ్ అకశాస్త టెక్నాలజీస్ తమ సంస్థలో 26 శాతం ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ టెలికం సెక్టార్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది.

దేశీయ నెట్‌వర్క్స్‌పై
టెలికం సెక్టార్‌లో అపారమైన అనుభవం ఉన్న తేజాస్ నెట్‌వర్క్స్‌లో 26 శాతం మేర స్టేక్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరినట్టవుతుందని, తమ పరిధిని విస్తరించుకోవచ్చని టాటా సన్స్ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టెలికం టెక్నాలజీ, ఫైబర్ బేస్డ్ బ్రాడ్‌బ్యాండ్ సెక్టార్‌లో లీడింగ్‌లో ఉంది తేజాస్ నెట్‌వర్క్స్ కంపెనీ. ఈ రెండు సెక్టార్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తేజాస్ నెట్‌వర్క్స్ వేల్యూ జూమ్
ఇందులో కనీసం 26 శాతం మేర వాటాలను కొనుగోలు చేయడం ద్వారా.. ఈ కంపెనీకి ఉన్న మౌలిక వసతులను వినియోగించుకోవాలనేది టాటా సన్స్ లక్ష్యమని చెబుతున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ ప్రకారం.. నేషనల్ స్టాక్స్ ఎక్స్‌చేంజ్‌లో తేజాస్ నెట్‌వర్క్స్ అయిదు శాతం పురోగతిని నమోదు చేసింది. ఆ కంపెనీ షేర్ వేల్యూ రూ.517.50 పైసల వద్ద నిలిచింది. టాటా సన్స్ 26 శాతం స్టేక్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన ప్రస్తుత పరిస్థితుల్లో దీని వేల్యూ మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications