For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్

|

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనుంది. గత ఏడాది కూడా దాదాపు ఇంతేమందిని తీసుకున్నది. వచ్చే ఏడాది కూడా దాదాపు అదే సంఖ్యలో లేదా అంతకుమించి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ రెండు రోజుల క్రితం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. మరుసటి రోజు ఈ నియామకాలకు సంబంధించి వెల్లడించింది.

టీసీఎస్ రానున్న మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగుల కలిగిన సంస్థగా కూడా రికార్డులకు ఎక్కనుంది. అప్పుడు దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత సంవత్సరంలో 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు.

 Tata Consultancy Services to hire over 40,000 in FY22

జనవరి-మార్చి 2021 కాలంలోనే 19,388 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు. ఈ త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ దేశీయ ఐటీ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను 40వేల మందిని చేర్చుకునే ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లోనే ఎక్కువమందిని చేర్చుకోనుంది. 12వేల మంది ఉద్యోగులు చేరితే టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటుతుంది.

English summary

TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్ | Tata Consultancy Services to hire over 40,000 in FY22

Tata Consultancy Services (TCS), which hired around 40,000 people last year, expects to hire a similar number or a little more in the financial year 2022.
Story first published: Wednesday, April 14, 2021, 21:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X