For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తైవాన్ పెగాట్రన్‌తో టాటా టైయప్.. 5 వేల కోట్ల పెట్టుబడి.. మొబైల్స్, ముడిసరకు ఉత్పత్తి

|

తైవాన్‌కి చెందిన పెగాట్రన్ కంపెనీతో టాటా ఒప్పందం కుదుర్చుకుంది. పెగాట్రన్ మొబైల్ ఫోన్ల ముడిసరుకు ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాటా రూ.5763 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పెగాట్రన్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడి పెడుతోంది. ఇదీ ఫేజ్-1 కింద మాత్రమేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

పెగాట్రన్, టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాయి. మొబైల్ ఫోన్లకు సంబంధించి ముడిసరకు ఉత్పత్తి చేస్తాయి. టాటా, పెగాట్రన్ కలిసి తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఫోన్లకు సంబంధించి స్పేర్ పార్ట్స్ విషయంలో ప్రపంచంలో భారతదేశం ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది.

Taiwans Pegatron, Tata to invest in Tamil Nadu to make phones, parts

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత చైనాను విశ్వసించడం మాని.. సొంతంగా స్పేర్ పార్ట్స్ తయారు చేస్తున్నారు. దీంతో బీజింగ్- వాషింగ్టన్ మధ్య వ్యాపారమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో భారత ప్రభుత్వం 16 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తమిళనాడులో సన్ ఎడిసన్ కంపెనీ రూ.4629 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ సోలార్ పీవీ మాడ్యుల్స్ ప్రొడ్యూస్ చేయబోతోది. ఓలా ఎలక్ట్రిక్ రూ.2354 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్న సంగతి తెలిసిందే.

English summary

తైవాన్ పెగాట్రన్‌తో టాటా టైయప్.. 5 వేల కోట్ల పెట్టుబడి.. మొబైల్స్, ముడిసరకు ఉత్పత్తి | Taiwan's Pegatron, Tata to invest in Tamil Nadu to make phones, parts

Taiwan’s Pegatron Corporation and Tata Electronics will invest separately in Tamil Nadu to make mobile phones and parts.
Story first published: Saturday, January 30, 2021, 21:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X