For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ విద్యార్థులకు జియో టీవీ యాప్ గుడ్‌న్యూస్, ఉచితంగా ఆ ఛానల్స్

|

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వం ఎడ్యుకేషన్ ఛానల్ T-Sat ఇక నుండి జియో జీవీ యాప్‌లోను ఉచితంగా వీక్షించవచ్చు. తెలంగాణలోని 1.59 కోట్ల మంది జియో కస్టమర్లు, దేశంలోని 40 కోట్లమంతి కస్టమర్లు కూడా జియో టీవీ యాప్ ద్వారా టీ-శాట్ చానల్‌ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు ఎడ్యుకేషనల్ ఈ-కంటెంట్‌ను తమ మొబైల్ ఫోన్లును దేశంలోని ఎక్కడి నుండైనా సులభంగా చూడవచ్చు.

రూ.2,000 క్రాస్... రిలయన్స్ రికార్డ్ ధర, అప్పుడు ఇవి కొంటే డబుల్ రిటర్న్స్రూ.2,000 క్రాస్... రిలయన్స్ రికార్డ్ ధర, అప్పుడు ఇవి కొంటే డబుల్ రిటర్న్స్

గురువారం నుండి జియో టీవీ యాప్ ద్వారా ప్రసారం

గురువారం నుండి జియో టీవీ యాప్ ద్వారా ప్రసారం

విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రసారాలు అందించడంలో ముందు వరసలో ఉన్న టి-శాట్ నెట్‌వర్క్ ఛానల్స్ దీని ద్వారా మరో ముందడుగు వేశాయి. ప్రయివేటు కమ్యునికేషన్ రంగంలోని జియో టీవి యాప్ ద్వారా ఉచితంగా టి-శాట్ ప్రసారాలు అందించేందుకు టి-శాట్ నెట్ వర్క్ సిద్ధమైంది. ఈ మేరకు టి-శాట్, జియో టీవి నెట్ వర్క్ విభాగాలు గురువారం నుండి ప్రసారాలు అందించాలని నిర్ణయించాయి. కరోనా ప్రభావం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యారంగానికి ఆన్‌లైన్ ప్రసారాలు అందిస్తున్న టి-శాట్ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలకు జియో టీవి యాప్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది.

వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో..

వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో..

ఇప్పటికే 24 గంటల ప్రసారాలతో నాలుగు లక్షల సబ్‌స్క్రైబ్స్ కలిగి ఉన్న టి-శాట్ యాప్ తెలంగాణలోని 1.59 కోట్ల జియో కస్టమర్లకు ప్రసారాలు అందనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నలభై కోట్ల జియో కస్టమర్లకు టి-శాట్ ప్రసారాలు ఉచితంగా చేరుతాయి. జియో సంస్థ దేశ వ్యాప్తంగా ప్రసారం చేసే 700 ఛానళ్లలో 64 ఛానళ్లు విద్యకు సంబంధించినవి ఉండగా వాటి చెంతకు టి-శాట్ నెట్ వర్క్ ఛానళ్లు చేరాయి. ఈ ప్రసారాలు వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో ఉండటం విద్యార్థులకు మరో అదనపు అవకాశంగా భావించాలి. పాఠశాల విద్యతో పాటు ఉన్నత స్థాయి, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రసారాలు, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్య ప్రసారాలు, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తూ సేవలందిస్తున్న టి-శాట్‌కు జియో టీవి నెట్ వర్క్ తోడవడం సంతోషమని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

అందరికీ ప్రయోజనం

అందరికీ ప్రయోజనం

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద, మారు మూల ప్రాంత విద్యార్థులకు సేవలు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న టి-శాట్ నిపుణ, విద్య ఛానళ్లకు జియో టీవి నెట్ వర్క్ తోడవటం విద్యార్థి రంగంతో పాటు ఇతర రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు శైలేష్ రెడ్డి. జియో టీవి తెలంగాణ సీఈవో కెసి రెడ్డి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టి-శాట్ నెట్ వర్క్ ఛానళ్ల ప్రసారాలను తమ జియో టీవి ద్వారా అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. టి-శాట్ ప్రసారాలను చూసే అన్ని వర్గాల ప్రజలకు జియో నెట్ వర్క్ ద్వారా మరింత స్పష్టత, స్వచ్ఛత ఏర్పడుతుందన్నారు. కరోనా ప్రభావం సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు టి-శాట్ ద్వారా సేవ చేసే అవకాశం లభించడం సంతృప్తిని ఇస్తోందని కేసీ రెడ్డి అన్నారు.

English summary

తెలంగాణ విద్యార్థులకు జియో టీవీ యాప్ గుడ్‌న్యూస్, ఉచితంగా ఆ ఛానల్స్ | T SAT education channels now available on Jio TV

Telangana Government's education channel T-SAT will now be available on JIO TV app at free of cost. WIh this, 1.59 crore jio customers in Telangana and around 40 crore customers across India can now access T-SAT channel using the JIO TV app.
Story first published: Wednesday, July 22, 2020, 21:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X