For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ATM నుండి రూ.1.5 లక్షలు ఉపసంహరణ, రూ.25 లక్షల టాప్-అప్ హెల్త్ కవర్

|

ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సరికొత్త సేవింగ్స్ ఖాతా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. సంపద వృద్ధితో పాటు బీమా రక్షణ కల్పించేలా ఈ ఖాతాను రూపొందించారు. ఈ పథకం పేరు సూర్యోదయ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్‌గా పేర్కొంది. ఈ ఖాతా తెరిచిన వారికి ఆకర్షణీయ వడ్డీ రేట్లతో పాటు ఫ్యామిలీకి ఉచిత బీమా, ఆరోగ్య సంరక్షణ, అపరిమిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ, వడ్డీ రేటు, టాప్-అప్ హెల్త్ కవర్‌కు సంబంధించి వివిధ రకాల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కీం ప్రత్యేకత వ్యక్తిగతంగా, కుటుంబాల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవడం గమనార్హం. ఖాతా తెరిచిన తర్వాత ఒక సంవత్సరం పాటు టాప్-అప్ హెల్త్ ఇన్సురెన్స్, హెల్త్ కేర్ ప్యాకేజీ ఉచితం. అలాగే మార్చి 2022 వరకు దేశవ్యాప్తంగా 102 ప్రాంతాల్లో 20 కిలో మీటర్ల దూరం వరకు ఉచిత అంబులెన్స్ సేవ అందుబాటులో ఉంటుంది.

అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హత

అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హత

- భారతీయ పౌరులు అయి ఉండాలి. వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

- వయసు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

- సూర్యోదయ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్ తెరిచేందుకు సగటున రూ.3 లక్షల బ్యాలెన్స్ నిర్వహణ, కీలక హెల్త్ డిక్లరేషన్ ఫామ్ అవసరం. అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3 లక్షలు మెయింటెన్ చేయాలి.

- వైద్య అత్యవసరమైనదని, ఇలాంటి ఎమర్జెన్సీ వ్యక్తిని లేదా కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉంటాయని, ఈ ప్రభావాన్ని కొంత తగ్గించడానికి తాము సూర్యోదయ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రవేశ పెట్టామని సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో భాస్కర్ బాబు అన్నారు. ఈ స్కీం ద్వారా వారి సంపద పెరగడంతో పాటు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారి జేబు నుండి డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం లేదని తెలిపారు.

ఫీచర్స్

ఫీచర్స్

- ప్లాటినమ్ రుపే సెక్యూర్ చిప్ డెబిట్ కార్డ్ వేరియంట్ ఉచితం.

- ప్రతి రోజు ఏటీఎం నుండి రూ.1.50 లక్షల నగదును ఉపసంహరించుకోవచ్చు.

- రోజు POS ఉపయోగ పరిమితి రూ.3 లక్షలు. (ట్రాన్సాక్షన్ వ్యాల్యూ)

- ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్ తన ఖాతాను హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

- హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్‌ ఖాతా తెరిస్తే మీరు, మీ జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు(మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి) రూ.25 లక్షల టాప్-అప్ ఆరోగ్య బీమా ఉంటుంది. అయితే, ఇక్కడ రూ.5 లక్షలు డెడక్టబుల్ అనే విషయం గుర్తించాలి. అంటే మీ వైద్య ఖర్చులు రూ.5 లక్షలు మించితే ఆపై మొత్తాన్ని మాత్రమే టాప్-అప్ ఆరోగ్య బీమా కింద క్లెయిం చేసుకోగలుగుతారు.

- నలుగురు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంరక్షణ. తొలి ఏడాది ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రెండుసార్లు వైద్య నిపుణులతో ఫోన్/వీడియో కన్సల్టేషన్ ఉచితం.

- ఒక్కోటి రూ.500 విలువ చేసే నాలుగు ఔషధ ఓచర్స్. రెండు డెంటల్ కన్సల్టేషన్ ఓచర్స్. రెండు డైట్ ఫిట్ ఓచర్స్.

- మార్చి 31, 2022 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు.

- సేవింగ్స్ పైన 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది నెలనెల ఖాతాలో జమ అవుతుంది.

- ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో అయినా అపరిమిత లావాదేవీలు చేయవచ్చు.

- రూ.2 లక్షల జీవిత బీమా. శాశ్వత అంగవైకల్యానికీ ఈ బీమా వర్తిస్తుంది.

English summary

ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ATM నుండి రూ.1.5 లక్షలు ఉపసంహరణ, రూ.25 లక్షల టాప్-అప్ హెల్త్ కవర్ | Suryoday Health and Wellness Savings Account Interest Rates, Benefits

Suryoday Health and Wellness Savings Account, a premium savings account product aimed at ensuring that the customers wealth not only grows but they and their families are also taken care of on the health.
Story first published: Friday, August 6, 2021, 21:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X