For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్‌కు ఊరట: ఫ్యూచర్ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

|

అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(FRL) డీల్‌కు ఒకింత బ్రేక్ వేసింది. ఈ ఒప్పందానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పగా, అమెజాన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పైన సుప్రీం సానుకూలంగా స్పందించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ విచారణ కొనసాగుతుందని తెలిపింది.

SBI debit card Green PIN: ఫోన్ కాల్‌తో SBI పిన్ జనరేట్ చేసుకోండి ఇలా..SBI debit card Green PIN: ఫోన్ కాల్‌తో SBI పిన్ జనరేట్ చేసుకోండి ఇలా..

డీల్ కుదరకుండా చిక్కులు

డీల్ కుదరకుండా చిక్కులు

ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌కు అమెజాన్ ద్వారా చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 29, 2020వ తేదీన ఫ్యూచర్ గ్రూప్ సంస్థలోని వాటాలను రూ.24,713 కోట్లకు RRVL కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు గత ఏడాది నవంబర్‌లో సీసీఐ, ఈఏడాది జనవరిలో సెబీ పచ్చజెండా ఊపాయి. RRVL-ఫ్యూచర్ డీల్ పైన అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

ఫ్యూచర్ గ్రూప్‌లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉంది. తమకు సమాచారం లేకుండా విక్రయించారని, తమ మధ్య ఉన్న ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపిస్తోంది. ఈ డీల్ కుదరకుండా చేసే ప్రయత్నాలు చేస్తోంది.

అమెజాన్‌తో కిషోర్ బియానీ సై అంటే సై

అమెజాన్‌తో కిషోర్ బియానీ సై అంటే సై

ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు అమెజాన్ అడ్డుపడటంపై కొద్ది రోజుల క్రితం కిషోర్ బియానీ ఘాటు కామెంట్స్ చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరిక వంటిదే అమెజాన్ ప్రయాస అని, ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకువీరుడు అలెగ్జాండర్ భారత్‌లో తోక ముడిచాడని, ఈ విషయాన్ని చరిత్ర చెబుతోందని కిషోర్ బియానీ ఇరవై రోజుల క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ పదేపదే ఫ్యూచర్ రిటైల్ పైన, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పైన, ప్రమోటర్ల పైన దాడి చేస్తోందన్నారు.

అమెజాన్ చివరకు తన బంధువులను కూడా వదలడం లేదన్నారు. అలెగ్జాండర్ ఆక్రమణ దురుద్దేశ్యంతో వచ్చాడని, అమెజాన్ కూడా తన ఉత్పత్తికి అలెక్సా అని పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.ఫ్యూచర్-రిలయన్స్ రిటైల్ డీల్‌పై అమెజాన్ ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్లింది. సింగిల్ జడ్జి కోర్టు స్టేటస్ కో విధించింది. దీనిపై కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ సవాల్ చేసింది.

ఇలా ఎదురుదెబ్బ

ఇలా ఎదురుదెబ్బ

ఆ తర్వాత రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి యథాతథ స్థితిని కొనసాగించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై రెండు వారాల క్రితం ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. చట్టాలకు అనుగుణంగా ఈ ఒప్పంద ప్రక్రియ ముందుకు వెళ్లేందుకు NCLT, CCI, సెబీ వంటి చట్టబద్ద సంస్థలు నిర్ణయాలు తీసుకోకుండా ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 2న సింగిల్ జడ్జి స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వగా, వారం అనంతరం వీటిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట లభించింది. అయితే తాజాగా సుప్రీం కోర్టులో స్టేటస్ కోకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఇది రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు ఎదురుదెబ్బ.

English summary

అమెజాన్‌కు ఊరట: ఫ్యూచర్ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ | Supreme Court halts Future Group's $3.4 billion deal on Amazon plea

Supreme Court has stopped regulatory approval for the Future Group’s $3.4 billion asset sale to Reliance Industries Ltd., effectively halting the deal and marking another victory for Amazon.com Inc., which wants to scuttle the transaction in its bid to dominate the country’s retail sector.
Story first published: Monday, February 22, 2021, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X