For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani-Hindenburg: అదానీపై సెబీ దర్యాప్తు సాగతీతకు 'NO' చెప్పిన సుప్రీం కోర్టు..!

|

Adani-Hindenburg: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణను పూర్తి చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కోరిన ఆరు నెలల గడువును ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సెబీ అభ్యర్థించిన 6 నెలల గడువును మంజూరు చేయటం కుదరదని తేల్చి చెప్పింది. గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే అందించగలమని ధర్మాసనం వెల్లడించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్(రిటైర్డ్) ఏఎం సప్రే కమిటీ నివేదికను కోర్టు రిజిస్ట్రీ స్వీకరించిందని, ప్యానెల్ ఫలితాలను పరిశీలించిన తర్వాత మే 15న ఈ అంశాన్ని విచారించాలనుకుంటున్నట్లు పేర్కొంది.

Supreme court denies to give SEBI 6 months time to probe into Adani-Hindenburg row

గడువు పొడిగింపుపై సెబీ చేసిన పిటిషన్‌పై మే 15న ఉత్తర్వులు వెలువరించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విచారణ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన పిటిషనర్ జయ ఠాకూర్ తరపున హాజరవుతున్న న్యాయవాదిని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఇది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్లను ప్రభావితం చేసే అవకాశమని పేర్కొంది. ఆరోపణలను పరిశీలించేందుకు ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని ధర్మాసనం పేర్కొంది.

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ "దశాబ్దాల కాలంలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం పథకం" అని US ఆధారిత షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌పై ఎస్సీలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విన్నప్పుడు ధర్మాసనం మార్చిలో ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సెబీని కోరింది. అప్పట్లో విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇచ్చింది.

English summary

Adani-Hindenburg: అదానీపై సెబీ దర్యాప్తు సాగతీతకు 'NO' చెప్పిన సుప్రీం కోర్టు..! | Supreme court denies to give SEBI 6 months time to probe into Adani-Hindenburg row

Supreme court denies to give SEBI 6 months time to probe into Adani-Hindenburg row..
Story first published: Friday, May 12, 2023, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X