For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: రూ. లక్షను రూ.85 లక్షలు చేసిన స్టాక్.. అదీ మూడేళ్లలోనే..

|

కోవిడ్ -19 తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. పెట్టుబడిదారులకు గొప్ప సంపద సృష్టిని అందించింది. అనేక మల్టీబ్యాగర్ స్టాక్‌లు మార్కెట్లో కనిపించాయి. అటువంటి స్టాక్‌లలో సునెడిసన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌ ఒకటి. ఇది గత 5 సంవత్సరాలలో తన వాటాదారులకు భారీ ఆదాయాన్ని ఇచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.223.87 కోట్లుగా ఉంది. ఇది పారిశ్రామిక రంగ సంస్థ. ఇది భారతదేశ సౌర వ్యవస్థకు చెందిన ప్రముఖ కంపెనీ.

20 ఏళ్లకు పైగా అనుభవం

20 ఏళ్లకు పైగా అనుభవం

సునెడిసన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సోలార్ ఎనర్జీ సర్వీసెస్‌లో బాగా తెలిసిన పేరు. సోలార్ సిస్టమ్ డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, ఇన్‌స్టాలేషన్‌లో ఈ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ స్టాక్ చరిత్రను పరిశీలిస్తే, శుక్రవారం బిఎస్‌ఇలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.498.60 వద్ద ముగిసింది. శుక్రవారం ఈ షేరు 4.99 శాతం లాభపడింది.

రూ.5.82

రూ.5.82

2019 మార్చి 20న షేరు ధర రూ.5.82గా ఉండేది. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే, ఈ కాలంలో ఈ స్టాక్‌లో 8,467.01 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే ఇది వార్షిక ప్రాతిపదికన 150.99 శాతం వృద్ధిని చూపింది. ఎవరైనా 5 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ స్టాక్ ఈ రోజు మీకు రూ. 85.67 లక్షలు అయి ఉండేది.

సంవత్సరంలో 850.62 శాతం రాబడి

సంవత్సరంలో 850.62 శాతం రాబడి

గత 1 సంవత్సరం నుంచి ఈ స్టాక్ ధరను పరిశీలిస్తే, 24 సెప్టెంబర్ 2021న, ఈ స్టాక్ ధర రూ. 52.24గా ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే, ఈ స్టాక్ 1 సంవత్సరంలో 850.62 శాతం రాబడిని నమోదు చేసింది. సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఈ రోజు దాని విలు రూ. 9.50 లక్షలుగా ఉండేది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్ కదలికలను పరిశీలిస్తే, జనవరి 3, 2022న ఈ స్టాక్ రూ. 184.20 వద్ద ఉంది.

5 రోజుల్లో ఈ స్టాక్ 21.68 శాతం

5 రోజుల్లో ఈ స్టాక్ 21.68 శాతం

ప్రస్తుత ధరతో పోల్చి చూస్తే, ఇప్పుడు ఈ స్టాక్ 170.68 శాతం పెరిగింది. 2022లో సెన్సెక్స్ ఇప్పటివరకు 1.83 శాతం క్షీణించింది. అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు మీకు రూ. 2.70 లక్షలు అయి ఉండేవి. గత 6 నెలల్లో ఈ షేరు 51.76 శాతం, గత నెలలో 39.78 శాతం లాభపడింది. గత 5 ట్రేడింగ్ రోజుల్లో ఈ స్టాక్ 21.68 శాతం పెరిగింది.

Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే ముంది నిపుణులు సంప్రదించగలరు.

English summary

Multibagger Stock: రూ. లక్షను రూ.85 లక్షలు చేసిన స్టాక్.. అదీ మూడేళ్లలోనే.. | Sunedison Infrastructure stock has become a multibagger stock in the last three years

Sunedison Infrastructure stock is one of the multibagger stocks. On March 20, 2019, the share price was Rs.5.82. As compared to the current market price, this stock recorded a gain of 8,467.01 percent during this period.
Story first published: Saturday, September 24, 2022, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X