For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Youtube వేగంగా వృద్ధి సాధిస్తోంది..షార్ట్స్‌కు రోజుకు 3.5 బిలియన్ వ్యూస్: పిచాయ్

|

న్యూఢిల్లీ: యూట్యూబ్ నుంచి వచ్చిన షార్ట్స్ ప్లేయర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ ప్లేయర్ ద్వారా రోజుకు 3.5 బిలియన్ వ్యూస్ వస్తున్నట్లు గూగుల్ చీఫ్ ప్రకటించారు. షార్ట్స్ అనే ఈ వీడియో మేకింగ్ యాప్ భారత్‌లో నిషేధంకు గురైన టిక్‌టాక్ లాంటి వీడియో యాప్. ఇందులో 15 సెకన్ల నిడివి గల వీడియోను రూపొందించొచ్చు. నాల్గవ త్రైమాసికంకు సంబంధించి విశ్లేషకులతో జరిగిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు సుందర్ పిచాయ్.

50 లక్షల ఛానెల్స్ యూట్యూబ్‌పై స్ట్రీమింగ్

50 లక్షల ఛానెల్స్ యూట్యూబ్‌పై స్ట్రీమింగ్

లైవ్ వీడియో, షార్ట్ వీడియోల ద్వారా క్రియేటర్లు లబ్ధి పొందేలా యూట్యూబ్ సంస్థ కొత్త ఆలోచనలు ప్రాడక్ట్స్‌తో వస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక 2020లో కరోనా కారణంగా అన్నీ ఆన్‌లైన్‌కు పరిమితం కావడంతో తొలిసారిగా 50 లక్షల ఛానెల్స్ యూట్యూబ్‌పై తమ లైవ్ స్ట్రీమింగ్ చేశాయని గుర్తుచేశారు పిచాయ్. కళాకారుల నుంచి ఆన్‌లైన్ చర్చి సర్వీసుల వరకు అంతా యూట్యూబ్ వేదికగా తమ చానెల్స్‌ను ప్రసారం చేసినట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక షార్ట్స్ వీడియో ప్లేయర్ ద్వారా రోజుకు 3.5 బిలియన్ వ్యూస్ వచ్చాయని ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరిస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.

యాడ్స్ ద్వారా 6.89 బిలియన్ డాలర్లు రెవిన్యూ

యాడ్స్ ద్వారా 6.89 బిలియన్ డాలర్లు రెవిన్యూ

ఇక నాల్గవ త్రైమాసికంలో యూట్యూబ్‌కు యాడ్స్ ద్వారా 6.89 బిలియన్ డాలర్లు రెవిన్యూ జనరేట్ అయ్యిందని చెప్పారు. గతేడాది ఇదే నాల్గవ త్రైమాసికంతో పోలిస్తే ఈ సారి 46 శాతం మేరా వృద్ధి కనిపించిందని చెప్పారు సుందర్ పిచాయ్. మూడేళ్ల క్రితం యూట్యూబ్‌లో యాడ్ రెవిన్యూ ఉండేది కాదని కానీ ఇప్పుడు అదే యూట్యూబ్‌పై యాడ్స్ వరదల వచ్చి పడుతున్నాయని చెప్పారు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ స్కిండ్లర్. ఇక ఇదే సమయంలో అడ్వర్టైజర్స్‌కు కూడా సులభతరంగా ఉండేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

మ్యూజిక్ ఇండస్ట్రీకి 3 బిలియన్ డాలర్లు

మ్యూజిక్ ఇండస్ట్రీకి 3 బిలియన్ డాలర్లు

ఇక యాడ్స్‌ను లేదా ఫలానా బ్రాండ్‌ను యూట్యూబ్ పై చూసే దాదాపు 70శాతం మంది వీక్షకులు ఆ బ్రాండ్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారని స్కిండ్లర్ స్పష్టం చేశారు. ఇక మ్యూజిక్ లేబుల్స్, పబ్లిషర్స్‌కు యూట్యూబ్ ప్రీమియం కొంత అధిక రెవిన్యూ ఇస్తోంది. 2019లో మ్యూజిక్ ఇండస్ట్రీకి యూట్యూబ్ యాజమాన్యం 3 బిలియన్ డాలర్లు చెల్లించగా ఇప్పుడు 30 మిలియన్ మ్యూజిక్ మరియు ప్రీమియం పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నట్లు స్కిండ్లర్ వివరించారు.

ప్రస్తుతం 95 దేశాల్లో తమ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పిన స్కిండ్లర్... వీరిలో కొందరికి చాలా బెనిఫిట్లు ఉంటాయని వెల్లడించారు. అమెరికాలో 100 మిలియన్ మంది యూట్యూబ్‌ను చూస్తున్నారు.ఇక క్రియేటర్లకు, ఆర్టిస్టులకు, మీడియా కంపెనీలకు గత మూడేళ్లలో దాదాపు 30 బిలియన్ డాలర్లను యూట్యూట్ చెల్లించినట్లు యూట్యూబ్ సీఈఓ సుసాన్ గత నెలలో చెప్పారు.

English summary

Youtube వేగంగా వృద్ధి సాధిస్తోంది..షార్ట్స్‌కు రోజుకు 3.5 బిలియన్ వ్యూస్: పిచాయ్ | Sundar Pichai says Youtube growing fast, shorts gets 3.5 billion views daily

Google CEO Sundar Pichai has revealed that You Tube shorts player is recieving 3.5 billion daily views and this will be expanded to other countries this year.
Story first published: Wednesday, February 3, 2021, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X