For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుందర్ పిచాయ్‌కు కీలక బాధ్యతలు: టాప్ గ్లోబల్ కంపెనీల్లో ఇండియన్ సీఈవోలు వీరే..!

|

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ పగ్గాలను చేపట్టనున్నారు. అల్పాబెట్ బాధ్యతలు అంటే ఆయనకు ప్రమోషన్ లభించినట్లే. గూగుల్ సీఈవోగా ఉంటూనే అల్పాబెట్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈవో బాధ్యతలు చేపట్టారు.

సుందర్ పిచాయ్ గూగుల్‌ను వీడుతున్నారా? గూగుల్ సీఈవో జాబ్ ఖాళీ అంటూ...సుందర్ పిచాయ్ గూగుల్‌ను వీడుతున్నారా? గూగుల్ సీఈవో జాబ్ ఖాళీ అంటూ...

సుందర్ పిచాయ్ చేతికి బాధ్యతలు

సుందర్ పిచాయ్ చేతికి బాధ్యతలు

ఆల్ఫాబేట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ల్యారీ పేజ్ కొనసాగారు. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఆయనా ఒకరు. ల్యారీ పేజ్, సెర్గె బ్రిన్ కలిసి ఆల్ఫాబేట్‌ను స్థాపించారు. ఇక్కడి నుంచే గూగుల్‌కు బీజం పడింది. ప్రస్తుతం ఆల్ఫాబేట్ సంస్థ పరిధిలో లైఫ్ సైన్సెస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ వంటి కొన్ని ప్రతిష్ఠాత్మకమైన భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వాటి బాధ్యతలను సుందర్ పిచాయ్ స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కీలక బాధ్యతల్లో కొనసాగిన లేదా కొనసాగుతున్న మరికొందరు...

సత్య నాదెళ్ల, ఇంద్రానూయి

సత్య నాదెళ్ల, ఇంద్రానూయి

- ఇండియన్ అమెరికన్ సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

- ఇంద్రా నూయి అక్టోబర్ 2006 నుంచి అక్టోబర్ 2008 వరకు పెప్సికో సీఈవోగా ఉన్నారు. అలాగే అక్టోబర్ 2018 నుంచి జనవరి 2019 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్‌గా ఉన్నారు.

శంతను నారాయణ్

శంతను నారాయణ్

- శంతను నారాయన్ అడోబ్ ఇంక్ సీఈవోగా ఉన్నారు. ఆయన జీఫిజర్ ఇంక్ బోర్డు మెంబర్ కూడా.

- 61 ఏళ్ల సంజయ్ మెహ్రోత్రా సెమీ కండక్టర్ బ్రాండ్ మైక్రాన్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సాన్‌డిస్క్ కో ఫౌండర్ కూడా. సాన్‌డిస్క్‌లో 27 ఏళ్ల పాటు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇంటెల్ కార్పోరేషన్‌లో ఆయన సీనియర్ డిజైన్ ఇంజినీర్‌గా తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు.

విక్రమ్ పండిట్, దినేష్ పాలివాల్, నికేష్ అరోరా

విక్రమ్ పండిట్, దినేష్ పాలివాల్, నికేష్ అరోరా

- ఇండియన్ అమెరికన్ బ్యాంకర్, ఇన్వెస్టర్ విక్రమ్ పండిట్ డిసెంబర్ 2007 నుంచి అక్టోబర్ 2012 వరకు సిటీ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. ప్రస్తుతం అతను ఓరోజెన్ గ్రూప్ సీఈవో, చైర్మన్‌గా ఉన్నారు.

- దినేష్ పాలివాల్ ఆగ్రాలో జన్మించారు. ఆయన హార్మాన్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇతను ఐఐటీ రూర్కీ గ్రాడ్యుయేట్.

- ఇండియన్ బిజినెస్‌మెన్ నికేష్ అరోరా పాలో ఆల్టో నెట్ వర్క్స్ ఇంక్ సీఈవో, చైర్మన్‌గా ఉన్నారు. 2018 జూన్‌లో ఆయన అరోరా సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. వారణాసి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్.

అజయ్ బంగా

అజయ్ బంగా

- పుణేకు చెందిన అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బోర్డు డైరెక్టర్ మెంబర్. మాస్టర్ కార్డులో గత పదేళ్లుగా పని చేస్తున్నారు. అతను తన కెరీర్‌ను నెస్ట్లే ఇండియాతో ప్రారంభించారు. పెప్సికోలో రెండేళ్ల పని చేశారు.

- 51 ఏళ్ల అశోక్ వేమూరి కాంట్యూయెంట్ ఇంక్ సీఈవోగా పని చేశారు.

- డయాజియో పీఎల్సీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇవాన్ మెనేజెస్ ఉన్నారు.

English summary

సుందర్ పిచాయ్‌కు కీలక బాధ్యతలు: టాప్ గ్లోబల్ కంపెనీల్లో ఇండియన్ సీఈవోలు వీరే..! | Sundar Pichai is Alphabet CEO: Check out other Indian leaders at top global companies

Google's parent Alphabet announced on December 3 that its co founders Larry Page and Sergey Brin were stepping back from running things at Alphabet.
Story first published: Thursday, December 5, 2019, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X