For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్.. వార్షిక వేతనం ఎంతో తెలుసా?

|

సుందర్ పిచాయ్.. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా పరిచయం అక్కర్లేని పేరు. మొన్నటి వరకు ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ సీఈవోగా ఉన్న పిచాయ్.. ఈ మధ్యనే దాని మాతృసంస్థ 'అల్ఫాబెట్ ఇన్‌కార్పొరేషన్'కు సీఈవోగా నియమితులయ్యారు. మరో మాటలో చెప్పాలంటే.. ఆ సంస్థకు ఇప్పుడు ఏ టూ జెడ్ అన్నీ ఆయనే.

అల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు.. ఆ సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత పదవీ విరమణ పొందుతూ తమ వారసుడిగా సుందర్ పిచాయ్‌ను సీఈవోగా ఎంపిక చేశారు. దీంతో పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్‌ వక్తిగా అవతరించారు. ఈ కొత్త హోదాలో ఆయన భారీ పారితోషిక ప్యాకేజీని అందుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక వేతనం...

ప్రపంచంలోనే అత్యధిక వేతనం...

గూగుల్ మాతృసంస్థ ‘అల్ఫాబెట్' సీఈవోగా సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోలలో ఒకరిగా నిలవనున్నారు. 2020 నుండి పిచాయ్‌ అందుకోనున్న (టేక్‌ హోమ్) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.14 కోట్లు. ఈ మేరకు ఇటీవల సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్(సెక్)కు అల్ఫాబెట్‌ వెల్లడించింది.

24 కోట్ల డాలర్ల స్టాక్ అవార్డ్ కూడా...

24 కోట్ల డాలర్ల స్టాక్ అవార్డ్ కూడా...

అంతేకాదు, రూ.14 కోట్ల వార్షిక వేతనానికి తోడు వచ్చే మూడేళ్లలో 24 కోట్ల డాలర్లు.. అంటే దాదాపు రూ.1700 కోట్లు విలువ చేసే షేర్లు కూడా ఆయనకు లభించనున్నాయి. అయితే ఇందులో 9 కోట్ల డాలర్లు(రూ.630 కోట్లు) షేర్లు.. అల్ఫాబెట్ కనబరిచే పనితీరుపై ఆధారపడి ఉంటాయి. అయితే సంస్థ పనితీరుతో ఏమాత్రం సంబంధం లేకుండా మరో రెండు స్టాక్ అవార్డులు ( 12 కోట్ల డాలర్లు, 3 కోట్ల డాలర్లు) కూడా ఆయన పొందుతారు. ఇటు గూగుల్‌తోపాటు అటు దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈవోగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకుగాను ఈ మేరకు పరిహార ప్యాకేజీని ఆయనకు అందజేస్తున్నారు.

2015లో గూగుల్ సీఈవో అయినప్పుడు...

2015లో గూగుల్ సీఈవో అయినప్పుడు...

భారీ వార్షిక వేతనాలు, నజరానాలు సుందర్ పిచాయ్‌కు కొత్తేమీ కాదు. 2015లో గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన అందుకున్న వార్షిక వేతనం 6.52 లక్షల డాలర్లు. ఆ తరువాతి కాలంలో ఈ మొత్తం భారీగా పెరిగింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న కార్పొరేట్ సీఈవోల్లో పిచాయ్ కూడా ఒకరయ్యారు. ఇక 2016లోనే ఆయన 200 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు పొందారు. ఆ తరువాత 2018లోనూ మరిన్ని షేర్ల రూపంలో ఆయనకు నజరానా ఇవ్వబోగా.. అందుకు ఆయన నిరాకరించినట్లు అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి.

ఇంతింత వేతనం ఇవ్వడం.. అవసరమా?

ఇంతింత వేతనం ఇవ్వడం.. అవసరమా?

అయితే గూగుల్, అల్ఫిబెట్ సంస్థలకు సారథ్యం వహిస్తోన్న సుందర్ పిచాయ్‌కు ఇలా భారీ వేతన ప్యాకేజీలు, కోట్ల విలువైన షేర్లు ఇస్తుండడంపై ఇటీవల జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఓ ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పిచాయ్ ప్రతిభ, ఆయన కనబరుస్తోన్న పనితీరును గుర్తించిన అల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు గూగుల్‌తోపాటు దాని మాతృసంస్థ పగ్గాలను సైతం ఆయన చేతిలోనే పెట్టడం గమనార్హం.

English summary

అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్.. వార్షిక వేతనం ఎంతో తెలుసా? | Sundar Pichai gets $242 million pay package from 2020

Google CEO Sundar Pichai’s compensation is changing to reflect his new dual role as Alphabet and Google chief executive. According to Bloomberg, which cites a financial filing published Friday, Pichai is being granted a $240 million stock package on top of a $2 million annual salary to take effect in 2020.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X