For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?

|

ఆడపిల్లలు కలవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయి. ఆడపిల్ల మేలు కోరి ఈ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. ఇక మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టింది. అలాంటి పథకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల పేరు మీద ఈ ఖాతాను బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో తెరవచ్చు. వీరి భవిష్యత్తుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం కింద సేవింగ్స్ చేస్తున్న తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇచ్చే వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు ప్రభుత్వం. జనవరి - మార్చి త్రైమాసికంలో వడ్డీ రేట్లను మార్చలేదు ప్రభుత్వం. సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్లలో మార్పులు చోటుచేసుకోవడం సహజం. కానీ ఇప్పుడు అలా జరగలేదు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఖాతా ఓపెన్ చేసిన సమయం నుంచి 21 ఏళ్లకు ఈ ఖాతా సమయం పూర్తవుతుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంకు వడ్డీ రేటు 7.6శాతంగా ఉంది.

Sukanya Samriddhi Yojana:How to do online payments via Indian post payment bank app

ఒకవేళ పోస్టాఫీసులో కనుక సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి ఉంటే ఇక అన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీలు జరపొచ్చు. ఇందుకోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

1) ముందుగా పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ ఉన్న ఏజెంట్‌ ద్వారా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్‌ను ఇన్స్‌టాల్ చేయించుకుని మీ వివరాలను నమోదు చేయించుకోవాలి

2)ఆ తర్వాత మీకున్న ఒక బ్యాంకు ఖాతా నుంచి ఐపీపీబీ ఖాతాలోకి డబ్బులను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.

3) ఐపీపీబీ యాప్‌ ఓపెన్ చేసి DOP మెనూలోకి వెళ్లాలి. అక్కడ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌పై క్లిక్ చేయాలి

4) అనంతరం సుకన్య సమృద్ధి యోజన (SSY) అకౌంట్ నెంబర్ మరియు DOP కస్టమర్ ఐడీలు ఎంటర్ చేయాలి. పోస్టల్ ఏజెంట్ మీకు డీఓపీ కస్టమర్ ఐడీ ఇస్తారు

5)ఇక ఆ తర్వాత ఇన్స్‌టాల్‌మెంట్‌ మరియు ఎంత డబ్బులు కట్టాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి

6)ఇక ఆ తర్వాత సబ్మిట్ చేస్తే మీరు చేసిన పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. అంతేకాదు మీ మొబైల్‌కు కూడా ఒక మెసేజ్ వస్తుంది

7) ఇలా IPPB యాప్‌తో మరిన్ని సేవలు పొందొచ్చు. ఈ యాప్ ద్వారా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ అందిస్తున్న పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పేమెంట్ చేయొచ్చు. పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఈ యాప్‌ ద్వారా చెల్లింపులు చేయొచ్చు.

English summary

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..? | Sukanya Samriddhi Yojana:How to do online payments via Indian post payment bank app

Individuals who have a girl child prefer Sukanya Samriddhi Account (SSA) while choosing tax-savings investments. The government has kept interest rates of small savings schemes, including that of Sukanya Samriddhi Account.
Story first published: Saturday, January 16, 2021, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X