For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబల్ షాక్స్‌ను తట్టుకోవడానికి పారెక్స్ నిల్వలు సహాయపడతాయి: డి సుబ్బారావు

|

నరేంద్ర మోడీ హయాంలో భారత్‌కు బలమైన విదేశీ మారకపు నిల్వలు జత కలిశాయి. ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఈ విదేశీ నిల్వలు భారత్‌కు కాస్త అండగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్‌లో బలమైన విదేశీ మారకపు నిల్వలు ప్రపంచవ్యాప్తంగా వచ్చే షాక్స్ నుండి పూర్తిగా నిరోధించలేకపోవచ్చునని, అనుకోని ప్రపంచ ఆర్థిక విపత్తులను తట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెప్పారు. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో బలమైన విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా షాక్స్ నుండి ఇప్పటికే నిరోధించిందనేది అవాస్తవమన్నారు.

రక్షణ కాదు.. కానీ సాయపడతాయి

రక్షణ కాదు.. కానీ సాయపడతాయి

భారత్‌కు ఉన్న బలమైన విదేశీ మారకనిల్వలు అంతర్జాతీయ షాక్స్‌కు రక్షణగా నిలువలేకపోవచ్చునని, కానీ ఆ ప్రతికూలతలను ఎదుర్కోవడానికి సాయపడతాయని దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. భారత్‌కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, అవి అంతర్జాతీయ కుదుపులకు రక్షణ అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. 'ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ షాక్స్ నుండి మనకు ఏమీ రక్షణ లేదు. అంతర్జాతీయ షాక్స్ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. అయితే మనకు ఉన్న విదేశీ మారకనిల్వలతో వాటిని ఎదుర్కొని నిలబడవచ్చు. ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి అవి సాయపడతాయి అంతే' అన్నారు. తద్వారా బలమైన విదేశీ మారకపు నిల్వలతో గ్లోబల్ షాక్స్ నుండి తప్పించుకోవచ్చునని చెప్పలేను కానీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మాత్రం ఉంటుందని చెప్పగలనని అన్నారు.

ఆర్బీఐ జోక్యం

ఆర్బీఐ జోక్యం

అభివృద్ధి చెందిన దేశాల్లో మానిటరీ పాలసీ సాధారణ స్థితికి చేరితే పెద్ద ఎత్తున విదేశీ నిధులు తిరిగి వెళ్లిపోతాయన్నారు. అప్పుడు మారక రేటు అస్థిరతలను నియంత్రించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. చాలా బలమైన ఒత్తిడి ఉంటే తప్ప మానిటరీ పాలసీ ఇన్‌స్ట్రుమెంట్‌ను ఉపయోగించరని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో భారత్‌ను ఏ గ్లోబల్‌ షాక్స్ ఏమీ చేయలేకపోతున్నదనే ప్రచారం ఉందని, అది వాస్తవం కాదని చెప్పారు. అయితే తట్టుకోవడానికి మాత్రం సాయపడతాయన్నారు.

అక్టోబర్ నాటికి..

అక్టోబర్ నాటికి..

అక్టోబర్ నాటికి దేశంలో 637.477 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు లేదా ఫారెక్స్ నిల్వలు నగదు, ఇతర రిజర్వ్ ఆస్తులు, ఇవి సెంట్రల్ బ్యాంక్ లేదా ఇతర ద్రవ్య అధికారం కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా దేశం యొక్క చెల్లింపులను సమతుల్యం చేయడానికి, దాని కరెన్సీ యొక్క విదేశీ మారకపు రేటును ప్రభావితం చేయడానికి మరియు నిర్వహించడానికి.

English summary

గ్లోబల్ షాక్స్‌ను తట్టుకోవడానికి పారెక్స్ నిల్వలు సహాయపడతాయి: డి సుబ్బారావు | Strong forex reserves to help India manage global shocks: Duvvuri Subbarao

Strong foreign exchange reserves in India will not insulate it from any global shocks but will help manage them, former Reserve Bank of India Governor D Subbarao said on Wednesday.
Story first published: Thursday, October 14, 2021, 9:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X