For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40వేల మంది ఇన్వెస్టర్లకు బకాయిలు రావాలి.. అలా చేయనీయొద్దు

|

ఇటీవల ఆరు డెట్ ఫండ్స్‌ను క్లోజ్ చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ తన బ్యాంకు రుణాల రీపేమెంట్ కోసం నగదును వినియోగించకుండా చూడాలని ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కన్‌స్ట్రక్షన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (సీఎఫ్ఎంఏ) మార్కెట్ రెగ్యులేటర్ సెబిని కోరింది.

మరింత ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపుమరింత ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

ఇప్పటికే 40,000 మంది ఇన్వెస్టర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నగదును రీపేమెంట్స్ కోసం ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్ 24వ తేదీన ఆరు డెట్ ఫండ్స్‌ను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.

Stop Franklin Templeton from using cash flow to repay bank loans

మ్యూచువల్ ఫండ్స్‌పై స్టాంప్ డ్యూటీ
దేశంలోని అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ అమలు అవుతోంది. ఈ నెల ప్రారంభం నుండి ఇది అమల్లోకి వచ్చింది. సిస్టమాటిక్ ట్రాన్సుఫర్ ప్లాన్స్, డెట్, ఈక్విటీ వంటి వాటిపై కూడా ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా డెట్ ఫండ్స్ పైన దీని ప్రభావం ఎక్కువ. కొనుగోలు, స్విచ్ ఇన్ అమౌంట్‌పై 0.005 శాతం, డీమ్యాట్ ఖాతాల బదలాయింపుపై 0.015 శాతం అమలవుతున్నాయి. 90 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఉంచుకునే వారిపై ఈ స్టాంప్ డ్యూటీ ఎక్కువ ప్రభావం చూపుతుంది.

English summary

40వేల మంది ఇన్వెస్టర్లకు బకాయిలు రావాలి.. అలా చేయనీయొద్దు | Stop Franklin Templeton from using cash flow to repay bank loans

The Chennai Financial Markets and Accountability, an investors protection organisation, has urged market regulator Sebi to stop Franklin Templeton Mutual Fund from repaying bank borrowings in six debt schemes that are being wound up.
Story first published: Sunday, July 5, 2020, 19:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X