For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన పేటీఎం షేర్లు..

|

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల పది నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 61,955 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 18,385 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.

టెక్‌ మహీంద్రా, టైటన్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్ఎం, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 62 పాయింట్లో కోల్పోయి 42,472 వద్ద ట్రేడవుతుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నష్టంలో ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.085 శాతం నష్టంలో కొనసాగుతోంది. గురువారం పేటీఎం షేరు ధర భారీగా పడిపోయింది. రూ.55 తగ్గి రూ.546 వద్ద కొనసాగుతోంది.

Stock markets started with slight losses on Thursday

యాంకర్ పెట్టుబడిదారులు లాకిన్‌ పీరియడ్‌ ముగియడంతో ఈ స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. నైకాలో కూడా యాంకర్ పెట్టుబడిదారులు లాకిన్‌ పీరియడ్‌ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. నైకా గురువారం 4.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఐటీ 0.13 శాతం నష్టంలో కొనసాగుతోంది.నిప్టీ ఎఫ్ఎంసీజీ 0.074 శాతం లాభంలో కొనసాగుతోంది.

English summary

Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన పేటీఎం షేర్లు.. | Stock markets started with slight losses on Thursday

Stock markets started with slight losses on Thursday. Paytm's share price fell sharply yesterday. It continues at Rs.546 down by Rs.55.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X