For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా-ఇండియా టెన్షన్: ఊగిసలాటలో మార్కెట్లు, కోలుకుంటున్న క్రూడాయిల్ ధరలు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 17) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త లాభాల్లోకి వచ్చినా, ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం 09:16 సమయానికి సెన్సెక్స్ 227.28 points పాయింట్లు లేదా 0.68% నష్టపోయి 33,377.94 వద్ద, నిఫ్టీ 66.20 పాయింట్లు లేదా 0.67% నష్టపోయి 9,847.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత సెన్సెక్స్ స్వల్పంగా 53 పాయింట్లు ఎగబాకింది. అ తర్వాత 30 పాయింట్లు కోల్పోయింది. మొత్తానికి మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. 420 షేర్లు లాభాల్లో, 557 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 40 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

<strong>ఇన్‌సైడర్ ట్రేడింగ్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి నోటీసులు</strong>ఇన్‌సైడర్ ట్రేడింగ్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి నోటీసులు

రూపాయి ఫ్లాట్‌గా

రూపాయి ఫ్లాట్‌గా

ఉదయం గం.10.45 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, గెయిల్ ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 76.20 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. మంగళవారం ఇక్కడే క్లోజ్ అయింది.

చైనా - ఇండియా క్లాష్

చైనా - ఇండియా క్లాష్

ఇండియా - చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలకు జరిగిన క్లాష్‌లో ఇరవై మంది ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు 43 మంది జవాన్లు గాయపడటం లేదా చనిపోవడం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే చైనా తనకు అనుకూలంగానే ప్రకటనలు చేస్తుంది. ఇందుకు కరోనా వైరస్ మంచి నిదర్శనం. ఓ వైపు ప్రపంచదేశాల్లో కేసులు, మరణాలు పెరుగుతుంటే, చైనాలో మాత్రం నెలలుగా పెద్దగా తేడా లేదు. ఇప్పుడు చైనా తన సైనికుల మృతిని కూడా కచ్చితంగా చెప్పడం ఊహించలేమని అంటున్నారు. అయితే ఈ ఘటన మార్కెట్లు డోలాయమానంలో ఉండటానికి కారణమయ్యాయి.

పుంజుకుంటున్న చమురు ధరలు

పుంజుకుంటున్న చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్లు కూడా నేడు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ వంటి ఒకటి రెండు మార్కెట్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో లాభాల్లోకి రావడం, షట్ డౌన్ వివిధ దేశాల్లోముగిసిపోతుండటంతో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ నిన్న బ్యారెల్‌కు 59 సెంట్లు లేదా 1.5 శాతం పెరిగి 40.31 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 51 సెంట్లు లేదా 1.4 శాతం పెరిగి 37.63 డాలర్లకు చేరుకుంది.

English summary

చైనా-ఇండియా టెన్షన్: ఊగిసలాటలో మార్కెట్లు, కోలుకుంటున్న క్రూడాయిల్ ధరలు | Stock Market: Sensex, Nifty gyrate between gains & losses

Benchmark indices witnessing volatile trade on Wednesday as investors remained cautious amid geo-political tensions between China and India, meanwhile global cues remained firm.
Story first published: Wednesday, June 17, 2020, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X