చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌తో (COVID 19) భయాందోళనలు అవసరం లేదని, దీనిపై చర్యలు తీసుకుంటున్నామని, తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా ప్రభావం దేశీయంగా ఆటో, ఫార్మా సహా వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రంగాలకు చెందినవారి ఆందోళన నేపథ్యంలో ఆమె స్పందించారు.

పరిశ్రమలకు నిర్మల భరోసా
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని అంచనా వేసేందుకు వివిధ రంగాల ప్రముఖులతో నిర్మల సీతారామన్ భేటీ అయ్యారు. వాణిజ్య, కస్టమ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటో, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, రసాయన, ఫ్యూయల్, సౌర, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, ఫార్మా రంగాలతో పాటు ఫిక్కీ, సిఐఐ, అసోచమ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పరిశ్రమలకు భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఏం చర్యలు తీసుకుంటున్నామో చెబుతాం..
పరిశ్రమలకు అందించగల ఉపశమనం గురించి పీఎంవోతో చర్చించనున్నట్లు నిర్మల తెలిపారు. రామెటీరియల్స్ పైన ఆధారపడిన ఫార్మా, సౌర, కెమికల్ ప్లాంట్స్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారని, ఈ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను త్వరలో ప్రకటిస్తామన్నారు. పీఎంవోను సంప్రదించాక కార్యాచరణను రూపొందించేందుకు మరోసారి భేటీ అవుతామన్నారు.

ధరలను నియంత్రించే చర్యలు
కరోనా వైరస్ ప్రభావం వల్ల ధరలు పెరుగుతాయనే ఆందోళనలు అవసరం లేదని నిర్మల అభిప్రాయపడ్డారు. ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరలు పెరుగుతాయనే భయాలు ఇంత వరకు వెలువడలేదన్నారు. మేకిన్ ఇండియాపై కరోనా ప్రభావం గురించి ఇప్పుడు చెబితే తొందరపాటు అవుతుందన్నారు.

ఫార్మా భయం..
ప్రస్తుతం దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత ఉన్నట్లు వార్తలు ఏవీ లేవని నిర్మల చెప్పారు. కానీ ఫార్మా పరిశ్రమ మాత్రం కొన్ని రకాల ఎగుమతులపై నిషేధం విధించాలని కోరుతోందని తెలిపారు. సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడవచ్చునని చెప్పారు.

రుణాల చెల్లింపులో జాప్యం
ముడిసరుకు రావడానికి జాప్యం అయితే వస్తువుల తయారీ, పంపిణీ జాప్యం కావొచ్చునని కొన్ని MSMEలు ఆందోళన వ్యక్తం చేసినట్లు నిర్మల తెలిపారు. అలా జరిగితే రుణాల బకాయిల చెల్లింపుల్లో జాప్యమవుతుందని బ్యాంకులు గుర్తించాలని వారు కోరినట్లు ఆమె తెలిపారు. అన్ని అంశాలు ముడి సరుకుతో ముడివడి ఉన్నందున బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారని చెప్పారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications