For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Alert: ఖాతాదారులను హెచ్చరించిన SBI.. లోన్ కోసం ఆ తప్పు అస్సలు చేయెుద్దంటూ ట్వీట్..

|

SBI Alert: ఈ రోజుల్లో ప్రజలు లోన్ కావాలనే ఆతృతలో ఏవేవో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అలా ఫేక్ రుణ యాప్స్ చేతిలో చిక్కుకుని చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ తన వినియోగదారులను హెచ్చరించింది.

దోచుకుంటున్న లోన్ యాప్స్..

దోచుకుంటున్న లోన్ యాప్స్..

ఇటీవలి కాలంలో లోన్ అప్లికేషన్ మోసాలు, రాకెట్ గ్రూపులు అవాంతరాలు రుణాన్ని అందించే పేరుతో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా దోచుకుంటున్నారనే దానిపై అనేక నివేదికలు వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయటానికి కూడా వీరు వెనకాడటం లేదు.

స్టేట్ బ్యాంక్ హెచ్చరిక..

తక్షణ రుణ యాప్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా తన వినియోగదారులను కోరింది. వినియోగదారులకు 6 భద్రతా చిట్కాలను సూచించింది. ఇన్ స్టాంట్ లోన్స్ ఎంచుకునే సమయంలో వాటిని పాటించాలని తెలిపింది.

నకిలీల సమాచారాన్ని..

నకిలీల సమాచారాన్ని..

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలని బ్యాంక్ వినియోగదారులను కోరింది. బ్యాంక్ లేదా ఫైనాన్సియల్ కంపెనీగా నటిస్తున్న కంపెనీలకు సమాచారాన్ని అందించవద్దని పేర్కొంది. వాటికి సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్‌ విభాగానికి https://cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా తెలియజేయాలని ట్వీట్ లో తెలియజేసింది.

SBI షేర్ చేసిన 6 భద్రతా చిట్కాలు:

SBI షేర్ చేసిన 6 భద్రతా చిట్కాలు:

1. డౌన్‌లోడ్ చేయడానికి ముందు యాప్ ప్రామాణికతను తనిఖీ చేయండి.

2. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

3. మీ డేటాను దొంగిలించగల అనధికార యాప్‌లను ఉపయోగించడం మానేయండి.

4. మీ డేటా దొంగిలించబడకుండా చూసుకోవడానికి యాప్ అనుమతి సెట్టింగ్‌లను తనిఖీ చేయండి.

5. అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్‌ల వివరాలను స్థానిక పోలీసు అధికారులకు నివేదించండి.

6. మీ అన్ని ఆర్థిక అవసరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://bank.sbiని సందర్శించాలని తెలిపింది.

Read more about: sbi bank news
English summary

SBI Alert: ఖాతాదారులను హెచ్చరించిన SBI.. లోన్ కోసం ఆ తప్పు అస్సలు చేయెుద్దంటూ ట్వీట్.. | state bank of india warned customers over fake instant loan apps and shred safety tips tobe followed in twitter

state bank of india warned customers over fake instant loan apps
Story first published: Wednesday, July 27, 2022, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X