SBI: రిసెషన్ ఎఫెక్ట్ ఇండియాపై తక్కువే..! ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా..
ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక మాద్యం భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే యూఎస్, యూరోప్ దేశాల్లో ద్రవ్యోల్బం పెరిగింది. దీంతో ఆర్థిక మాద్యం వస్తుందని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆర్థిక మాద్యం వస్తే.. ఆ ప్రభావం మిగతా దేశాల కంటే భారత్ పై తక్కువ ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. భారత్ లో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణం
కొన్ని విషయాలను ఆయన ప్రస్తావించారు. భారత్ లో ద్రవ్యోల్బణం ప్రపంచంలో కంటే చాలా తక్కువగా పెరిగిందని గుర్తు చేశారు.పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడానికి అతిపెద్ద కారణం సరఫరా గొలుసులో డిస్టఫెన్స్ రావడమని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా గొలుసు సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గలేదని.. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కోవిడ్ లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులపై ప్రతికూల ప్రభావం పడిందని అభిప్రాయపడ్డారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం చాలా మెరుగ్గా ఉందని దినేష్ ఖరా చెప్పారు. దేశం జిడిపిలో ఎక్కువ భాగం దేశీయ డిమాండ్‌పై ఆధారపడి ఉందని తెలిపారు. అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో ప్రపంచ మాంద్యం ప్రభావం ఉంటుందని.. కానీ భారత్ స్థానం ప్రపంచం కంటే మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.